కేసీఆర్ టార్గెట్‌గా అమిత్ షా సభ

111
Amit Shah To Hold Public Meeting In Telangana
Amit Shah To Hold Public Meeting In Telangana

Amit Shah To Hold Public Meeting In Telangana

తెలంగాణా రాష్ట్రంలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది . తెలంగాణా సీఎం కేసీఆర్ సీఏఏ కు వ్యతిరేకంగా క్యాబినెట్ లో తీర్మానం చేసిన నేపధ్యంలో ఆయన తెలంగాణలో సభ నిర్వహించటం ఆసక్తికరంగా మారింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. గతంలో అమిత్ షా పర్యటన సమయంలో కూడా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం ప్రేపాయి. ఇక తాజాగా మరో మారు అమిత్ షా పర్యటన చెయ్యనున్న నేపధ్యంలో రాజకీయ వేడి రగులుతుంది.  ఓవైపు కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏకు వ్యతిరేకంగా దేశ్యాప్తంగా ఆందోళన కొనసాగుతుండగా.. హైదరాబాద్‌లోనూ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అయితే, ఇదే సమయంలో.. భారతీయ జనతా పార్టీ.. సీఏఏకు అనుకూలంగా సభలు నిర్వహిస్తోంది.. అందులో భాగంగా మార్చి 15వ తేదీన హైదరాబాద్‌కు రానున్నారు షా… ఇక, సభను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు తెలంగాణ బీజేపీ సిద్ధమవుతోంది.. దీని కోసం ఇప్పటికే ఎల్బీ స్టేడియాన్ని బుక్ చేశారు బీజేపీ నేతలు.. ఎప్పుడు రాష్ట్రానికి వచ్చినా.. ఏదో హాట్ కామెంట్ చేసే వెళ్లే అమిత్‌షా.. ఈ సారి ఏం మాట్లాడతారనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. మరోవైపు సీఏఏకు వ్యతిరేకంగా తెలంగాణ కేబినెట్ తీర్మానం కూడా చేయడంతో.. టీఆర్ఎస్ సర్కార్‌ను టార్గెట్ చేస్తూనే… మరోవైపు ఎంఐఎంపై కూడా హాట్ కామెంట్లు చేయడం పక్కా అని భావిస్తున్నారు.

Amit Shah To Hold Public Meeting In Telangana ,cm kcr,#amithshah, bjp, trs party, #telangana, mim, hyderabad , lb stadium , caa,#nrc,#npr

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here