తెలంగాణలో ఖరారైన అమిత్‌ షా పర్యటన

71
Amit Shah's confirm visit to Telangana
Amit Shah's confirm visit to Telangana

తెలంగాణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన ఖరారైంది. ఈ నెల 17 వ తేదీన రాష్ట్రానికి అమిత్ షా రానున్నట్లు ఎంపీ సోయం బాపూరావు ప్రకటించారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్‌ వెయ్యి ఊడల మర్రి దగ్గర సభకు భాజపా నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. అమిత్ షా పర్యటన రోజు బండి సంజయ్‌ పాదయాత్రకు విరామమిచ్చి బహిరంగ సభలో పాల్గొంటారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వెయ్యి మందిని ఇదే మర్రిచెట్టు దగ్గర రజాకార్లు ఊచకోత కోశారు. కాలక్రమంలో ఆ మర్రిచెట్టు వెయ్యి ఊడల మర్రిగా ప్రసిద్ధి చెందింది. అదే వెయ్యి ఊడల మర్రి చెట్టు వద్ద భాజపా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here