విశాఖ మెట్రోకు కొత్త డీపీఆర్…

AMRC to invite tenders for Visakhapatnam light metro DPR

సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ఏర్పాటుకు శరవేగంగా పావులు కదుపుతున్నారు . విశాఖనే పరిపాలనా రాజధాని అని తాజాగా మరోమారు ప్రకటన  చేసిన సీఎం జగన్ మిలీనియం టవర్స్ నిర్మాణానికి అధికారికంగా నిధులు కేటాయించి పనుల్లో స్పీడ్ పెంచిన విషయం తెలిసిందే . ఇక అంతే కాదు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్న జగన్ విశాఖ మెట్రో రైలు కోసం కొత్త డీపీఆర్ సిద్ధం చెయ్యమని అధికారులను ఆదేశించారు .విశాఖ వాసులకు పరిపాలనా రాజధాని విశాఖలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.  గతంలో  విశాఖకు మెట్రో రైల్ ప్రాజెక్ట్ కోసం చేసిన  ప్రయత్నాలు నాలుగడుగులు ముందుకు పదడుగులు వెనక్కు అన్నట్టుగా సాగినా గత డిసెంబర్లో  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ మెట్రోపై  నిర్వహించిన సమీక్షా సమావేశంలో  విశాఖ మెట్రోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక తాజాగా విశాఖలోని మెట్రో రైలు ప్రాజెక్టుకు కొత్త డీపీఆర్‌ రూపకల్పన కోసం ప్రతిపాదనల్ని పిలవాల్సిందిగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మేరకు కొటేషన్లు పిలిచేందుకు అమరావతి మెట్రో రైలు ఎండీకి ఆదేశాలు ఇచ్చారు . విశాఖలో 79.9 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణం కోసం కొత్త డీపీఆర్‌లను రూపొందించేందుకు ప్రభుత్వం కార్యాచరణకు సిద్ధమైనదని తాజా ప్రకటన ద్వారా తెలుస్తుంది . మూడు కారిడార్లలో మెట్రో రైలు నిర్మాణం  కోసం డీపీఆర్‌ల రూపకల్పనతో పాటు 60 కిలోమీటర్ల మేర మోడరన్‌ ట్రామ్‌ కారిడార్‌ ఏర్పాటుకు మరో డీపీఆర్‌ను సిద్ధం చేసేందుకు ప్రతిపాదనల్ని స్వీకరించాలని  వైసీపీ ప్రభుత్వం సూచించింది. గతంలో డీపీఆర్‌ రూపకల్పన కోసం ఎస్సెల్‌ ఇన్ఫ్రా కాన్సార్షియం కు ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేసింది. ప్రతిపాదనల రూపకల్పన కోసం ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌, రైట్స్‌, యూఎంటీసీ తదితర సంస్థలను సంప్రదించాల్సిందిగా ప్రభుత్వం ఉత్వరుల్లో పేర్కొంది.  విశాఖ మెట్రో నిర్మాణం మంచి నిర్మాణశైలితో జరగాలని,  అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి, అత్యుత్తమ విధానాలతో అద్భుతంగా నిర్మాణం చేయాలని  సీఎం జగన్ అధికారులకు సూచించారు. మెట్రోలో  రైలు కోచ్ ల  నుండి  స్టేషన్ల నిర్మాణం అద్భుతంగా నిర్మించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

విశాఖ మహానగరాన్ని  రాజధాని నగరంగా తీర్చిదిద్దుతున్న క్రమంలో సీఎం జగన్ తాజాగా కొత్త డీపీఆర్ సిద్ధం చెయ్యాలని, అద్భుతంగా మెట్రో నిర్మాణం చెయ్యాలని  తీసుకున్న నిర్ణయం పై విశాఖ వాసుల నుండి హర్షం వ్యక్తం అవుతుంది. విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు  చేస్తున్న క్రమంలో సీఎం జగన్ తాజాగా డీపీఆర్ మార్చి కొత్త డీపీఆర్ రాజధాని హంగులకు  తగ్గట్టుగా రూపొందించాలని చెప్పటం కీలక పరిణామం.
AMRC to invite tenders for Visakhapatnam light metro ,#DPR,Visakha Metro Rail Project,#CMJagan

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article