పంజాబ్‌లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఖలిస్తాన్ వేర్పాటువాద నేత అమృత్ పాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్‌లోని జలంధర్‌లో శనివారం పోలీసులు అమృత్ పాల్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ప్రత్యేక ఖలిస్తాన్ దేశ ఏర్పాటుకు ఉద్యమం చేస్తోన్న అమృత్ పాల్ సింగ్.. ఇటీవల భారత్ హోంమంత్రి అమిత్ షాను హెచ్చరించిన విషయం తెలిసిందే. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి పట్టిన గతే అమిత్ షాకు పడుతుందని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా ఇటీవల పంజాబ్ రాష్ట్రంలో ఓ పోలీస్ స్టేషన్‌పై అనుచరులతో కలిసి దాడి చేసి పోలీసులు అరెస్ట్ చేసిన ఖలిస్తాన్ వేర్పాటువాదులను స్టేషన్ నుండి బయటకు తీసుకువచ్చాడు.