ఎమీజాక్స‌న్ ఎంగేజ్డ్‌

మోడ‌లింగ్ ఫీల్డ్ నుండి సినిమా రంగంలోని అడుగు పెట్టిన బ్రిటీష్ సుంద‌రి ఎమీజాక్స‌న్‌. తొంద‌ర‌లోనే పెళ్లి చేసుకోనుంది. వివ‌రాల్లోకెళ్తే ఈ అమ్మ‌డు చాలా రోజులుగా బ్రిట‌న్‌కు చెందిన ఓ ప్ర‌ముఖ వ్యాపార వేత్త జార్జ్ పనాయొటోతో డేటింగ్ చేస్తున్నారు. జ‌న‌వ‌రి 1, కొత్త సంవత్స‌రం సంద‌ర్భంగా వీరి నిశ్చితార్థం జాంబియాలో జ‌రిగింది. “జ‌న‌వ‌రి 1, 2019 మ‌న జీవితాల్లో కొత్త ప్ర‌యాణం. ఐ ల‌వ్ యూ, నన్ను ఎల్ల‌ప్పుడూ సంతోషంగా ఉంచుతున్నందుకు సంతోషంగా ఉంది.. ధ‌న్య‌వాదాలు“ అన్నారు. అలాగే జార్జ్‌తో ఎమీ క‌లిసి ఉన్న ఫోటోను త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసి త‌మ ఎంగేజ్‌మెంట్ విష‌యాన్ని ఎమీ జాక్స‌న్ తెలియ‌జేసింది. అయితే పెళ్లెప్పుడ‌నే సంగ‌తిని మాత్రం చెప్ప‌లేదు. మ‌ద‌రాసు ప‌ట్ట‌ణంతో ద‌క్షిణాది సినిమా రంగంలోని అడుగుపెట్టిన ఎమీజాక్స‌న్ త‌ర్వాత తెలుగులో ఎవ‌డు.. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఐ, 2.0 సినిమాలు స‌హా విజ‌య్ థెరి ఇలా ప‌లు చిత్రాల్లో న‌టించి ఆక‌ట్టుకున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article