టీడీపీకి షాక్ ఇచ్చిన అనకాపల్లి ఎంపీ అవంతి

Anakapalli MP Avanthi shock for TDP  .. వైసీపీలో చేరిక

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికారి టిడిపికి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఒకపక్క చీరాల ఎమ్మెల్యే ఆమంచి శ్రీనివాస్ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ బాట పడితే ఊహించని విధంగా అనకాపల్లి ఎంపీ సైతం టీడీపీకి షాక్ ఇచ్చారు. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీకి గుడ్ బై చెప్పారు. వైసీపీలో చేరారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. అవంతికి పార్టీ కండువా కప్పి జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ ఎంపీ పదవికి రాజీనామా చేశానని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీలందరూ రాజీనామా చేయాలని చంద్రబాబుకు సూచించానని ఆయన తన మాట వినలేదని అవంతి అన్నారు.
చంద్రబాబు అవకాశవాది అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ధర్నాలు, దీక్షలతో చంద్రబాబు ఏమీ సాధించలేరన్నారు. హోదా విషయంలో జగన్ ఒకే విధానంతో ఉన్నారని తెలిపారు. రాష్ట్రానికి కాంగ్రెస్ అన్యాయం చేసిందన్న చంద్రబాబు…అదే కాంగ్రెస్ తో చేతులు కలపడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు ఏది చెబితే అది జనం నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఎన్నికల ముందు స్కీమ్ లు పెడితే ఓట్లు పడవన్నారు. రాష్ట్రంలో అవినీతి వల్లే కేంద్రం నుంచి నిధులు ఆగాయన్నారు.

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article