విజయ్ దేవరకొండకు హీరోయిన్ ఫైనల్

117
Ananya Pandey to Play Lead for Vijay Devarakonda
Ananya Pandey to Play Lead for Vijay Devarakonda

Ananya Pandey to Play Lead for Vijay Devarakonda

విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో రాబోతోన్న సినిమా ఫైటర్. యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతోన్న ఈచిత్రాన్ని ప్యాన్ ఇండియన్ సినిమాగా మలిచేందుకు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ రంగంలోకి దిగాడు. దీంతో ఈ మూవీ ముందుగా తెలుగు సినిమాగా అనౌన్స్ అయినా.. ఇప్పుడు ప్యాన్ ఇండియన్ సినిమాగా మొదలు కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం థాయ్ లాండ్ లో మార్షల్ ఆర్ట్స్ లో ట్రెయినింగ్ తీసుకుంటున్నాడు విజయ్. తనకు తోడుగా ట్రెయినింగ్ లో అండగా ఉంది ఛార్మీ.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ను తీసుకోవాలనుకున్నారు. తను కూడా ఓకే చెప్పింది. అటు కరణ్ జోహార్ కూడా ఉన్నాడు కాబట్టి.. జాన్వీ ఈ ప్రాజెక్ట్ తో సౌత్ లో షైన్ కావాలనుకుంది. బట్.. మధ్యలో డేట్స్ ప్రాబ్లమ్స్ వచ్చాయని తను తప్పుకుంది. అయితే తెలుగుతో పాటు హిందీలో రూపొందుతోంది కాబట్టి ఖచ్చితంగా బాలీవుడ్ భామనే తీసుకోవాలనుకున్నారేమో.. అందుకే కరణ్ జోహారే పరిచయం చేసిన అనన్య పాండేను ఫైనల్ చేశారు. తను కూడా రీసెంట్ గా ఈ ప్రాజెక్ట్ కు సైన్ చేసింది. అనన్య బాలీవుడ్ కు ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2’తో పరిచయం అయింది. అయితే ఇందులో మరో హీరోయిన్ కు కూడా ఛాన్స్ ఉందట. మరి ఆ బ్యూటీ ఎవరో కానీ.. మెయిన్ లీడ్ లో మాత్రం అనన్య ఫైనల్ అయినట్టే.

Ananya Pandey to Play Lead for Vijay Devarakonda,Puri Jagannadh,Vijay Devarakonda,Fighter Movie,Janhvi Kapoor,Charmi,Action And Thriller,Marshals

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here