ఝాన్సీ యాంక‌రింగ్ మానేసిందా?

Anchor Janshi Stopped anchoring
ఇండ‌స్ట్రీలో అమ్మాయిలు యాంక‌రింగ్‌లో రాణించాల‌ని క‌ల‌లు కంటూ ఉంటారు. అయితే అవ‌కాశం కొందరికే ద‌క్కుతుంది. అందులోనూ  స్టార్ యాంక‌ర్స్‌గా రాణించేవారు కొంత మందే ఉంటారు. అలాంటి స్టార్ యాంక‌ర్స్‌లో ఒక‌రైన ఝాన్సీ యాంక‌రింగ్ మానేసింద‌ని వార్త‌లు వినిపించాయి. అయితే ఎవ‌రో కుట్ర చేసి ఝాన్సీతో యాంక‌రింగ్ మానేయించార‌ని వార్త‌లు వినిపించాయి. దీనిపై ఝాన్సీ స్పందిస్తూ త‌న యాంక‌రింగ్‌కు దూరం కావ‌డం అనేది చాలా రోజులుగా అనుకుంటున్న‌దే అని.. ఎవ‌రూ కుట్ర చేయ‌లేద‌ని ఆమె చెప్పింది. ఇప్పుడు ఆమె సామాజిక కార్య‌క్ర‌మాల్లో బిజీగా మారుతున్నారు. యాంకరింగ్ చేసిన కార్య‌క్ర‌మాల‌ను క‌మిట్‌మెంట్‌తో చేశాన‌ని చెప్పిన ఝాన్సీ త‌ను ఎక్కువ‌గా చేత‌న‌, న‌వీన వంటి సామాజిక కార్య‌క్ర‌మాల‌ను హోస్ట్‌గా ప‌నిచేసిన‌ట్లు తెలిపింది.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article