ANDHRA PRADESH GOVERNMENT HELPS NTR BIOPIC
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవిత కథను `యన్.టి.ఆర్` పేరుతో తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో తొలి భాగం `యన్.టి.ఆర్ కథానాయకుడు` పేరుతో జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో నటిస్తూ నిర్మించిన చిత్రమిది. ఎన్టీఆర్ బయోపిక్ కావడమే కాదు.. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండటంతో `యన్.టి.ఆర్ కథానాయకుడు` సినిమాకు ప్రభుత్వం అండ కూడా దొరికింది. అదనపు షోలకు పర్మిషన్ దొరికింది. జనవరి 9 నుండి 16 వరకు రోజూ ఆరు షోలను ప్రదర్శిస్తారట. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రంలో రెండో భాగం `యన్.టి.ఆర్ మహానాయకుడు` ఫిబ్రవరి 7న విడుదల కానుంది.
for more movie updates click here