విశాఖలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టి20 క్రికెట్ సందడి నెలకొంది.పిఎం పాలెం ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏ పీ ఎల్ టి 20 క్రికెట్ జెర్సీ ట్రోఫీ నీ వై.ఎస్.ఆర్ క్రికెట్ స్టేడియంలో ఆవిష్కరించారు.ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భీమిలి ఎమ్మెల్యే, వైసిపి జిల్లా అధ్యక్షులు ముత్తం శెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున రావు, సిటీ పోలీస్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్, జివిఎంసి మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీ షా పాల్గొని జెర్సీ లోగో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభిం చారు. కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో క్రికెట్ విపరీత మైన ఆదరణ ఉందని,ఆంధ్రప్రదేశ్ లో క్రీడాకారులకు కొదవ లేదని సరైన ప్రోత్సాహం లేక మరుగున పడిపోతున్నారని ఏపీఎల్ టీ 20 టోర్నమెంట్ కు బీసీసీఐ అనుమతి ఉందని ఆంధ్రప్రదేశ్ లో ఏపీఎల్ నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు.
విశాఖ వేదికగా వచ్చే నెల 6 వ తేదీ నుంచి మినీ ఐపీఎల్ కు సర్వం సిద్ధమైంది. మినీ ఐపీఎల్‌గా భావించే ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ కోసం క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్ జూలై 6 నుంచి 17 వరకు కొనసాగనున్నది.ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ ట్వంటీ 20 టోర్నమెంట్ నిర్వహణకు భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ఏసీఏకు అనుమతి ఇచ్చింది. గతంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టీ 20 టోర్నమెంట్ తరహాలో ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లను నిర్వహించడానికి తమిళనాడు, కర్ణాటక, సౌరాష్ట్రలకు ఇండియన్ క్రికెట్ బోర్డు అనుమతించింది.