ఏపీ రాజధాని ఎక్కడో తేల్చే నిపుణుల కమిటీ రిపోర్ట్ సిద్ధం

Andra Pradesh Capital news Upadtes

ఏపీ రాజధానిపై ఇప్పటికే నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. దీంతో ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగిస్తారా.? లేదా వేరే చోటుకు తరలిస్తారా.? హైకోర్టుకు భూములను ఎక్కడ కేటాయిస్తారు.? అనే అంశాలపై ఉత్కంఠ మొదలైంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వెలగపూడి కేంద్రంగా అమరావతిని రాజధానిగా ప్రకటించి నిర్మాణాలు చేపట్టారు చంద్రబాబు . చంద్రబాబు సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి పాలు కావటంతో  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్ని రోజులకే ఏపీ రాజధానిగా అమరావతిపై నీలినీడలు అలముకున్నాయి. రాజధానిగా అమరావతి  అనుకూలమైనది కాదని.. రాజధాని తరలింపు త్వరలోనే జరుగుతుందని కొందరు వైసీపీ నేతలు ప్రస్తావించారు. అంతేకాక రీసెంట్‌గా కేంద్రం విడుదల చేసిన భారతదేశం పొలిటికల్ మ్యాప్‌లో కూడా అమరావతి పేరు లేకపోవడంతో ప్రజల్లో కాస్త కలవరం మొదలైంది. దీంతో సీఎం జగన్ ఏపీ రాజధాని అంశాన్ని తేల్చేందుకు జీఎన్ రావు నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన సంగతి విదితమే. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రజాభిప్రాయాల్ని కూడా సేకరించింది.
సుమారు ఆరు వారాలుగా రాష్ట్రమంతా పర్యటించిన నిపుణుల కమిటీ రాజధాని ప్రాంత అభివృద్ధి, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించేందుకు సిద్దమైందట. ప్రస్తుతం వెలగపూడిలో ఉన్న సచివాలయాన్ని, అసెంబ్లీ ప్రాంగణాన్ని మంగళగిరికి తరలించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు చర్చ జరుగుతుంది . కాజా సమీపంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో రాజధానిని ఏర్పాటు చేస్తే అనుకూలంగా ఉంటుందని నిపుణుల కమిటీ సూచించినట్లు తెలుస్తోంది. ఇక హైకోర్టును మాత్రం కర్నూలుకు తరలించే యోచనలో ప్రభుత్వం ఉందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కాగా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిసెంబర్‌లో రాజధాని విషయంపై ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి దీనిలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

tags : ap capital, amaravathi, mangalagiri, velagapuri, experts committee, report, ys jagan, kaza

వంశీ చేరికపై యార్లగడ్డ వెంకట్రావు ఏమన్నారంటే

సమ్మె యథాతథం…కొనసాగుతున్న ఆర్టీసీ కార్మిక పోరాటం

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article