చైనాలో ఇరక్కున్న జ్యోతి పరిస్థేంటి?

153
Annem Jyothi stuck in Wuhan
Annem Jyothi stuck in Wuhan

Annem Jyothi stuck in Wuhan

కరోనా వైరస్ ఒక కాబోయే వధువు జీవితంతో ఆడుకుంటుంది . ఊహాన్ చిక్కుకున్న తెలుగమ్మాయి జ్యోతికి ఈ నెల 14 న వివాహం నిశ్చయం అయ్యింది . ఇటీవల అక్కడ  చిక్కుకున్న తెలుగు వారిని ఇండియాకు తీసుకువచ్చిన సమయంలో జ్యోతికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో ఆమెను అక్కడే వదిలి వచ్చారు. దీంతో వుహాన్‌లో చిక్కుకున్న తెలుగమ్మాయి జ్యోతి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డిని కలిసిన జ్యోతి కుటుంబ సభ్యులు.. తమ కూతురును తీసుకొచ్చేలా ప్రయత్నాలు చేయాలని కోరారు. ఈ మధ్యాహ్నం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌ను కూడా కలవనున్నారు. ఢిల్లీలో హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ద్వారా కేంద్రమంత్రులను కలిసేందుకు యత్నం చేస్తున్నారు జ్యోతి కుటుంబ సభ్యులు. ఈ నెల 14న జ్యోతి వివాహం ఉండడంతో వీలైనంత త్వరగా తమ కుమార్తెను స్వస్థలానికి రప్పించే చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు. భారత్‌-చైనా మధ్య విమాన రాకపోకలు పూర్తిగా నిలిపివేయడంతో స్వదేశానికి రాలేని దీన స్థితిలో ఉంది జ్యోతి. వీలైతే తనను తీసుకెళ్లాలని , లేదంటే చైనాలోని మరో సురక్షిత నగరానికైనా తరలించాలని ఆమె విజ్ఞప్తి చేస్తోంది.

Annem Jyothi stuck in Wuhan,china, huwan , coronavirus, coronavirusindia

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here