అంబేద్కర్ విగ్రహానికి పాలభిషేకం

విజయవాడ:కోనసీమ లో అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కోనసీమలోని అల్లర్లు జరగడానికి ముఖ్యమైన కారణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులని తెలిపారు. గతంలో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంత బాబు చేసిన హత్య కేసు నుండి ప్రజల దృష్టి మరల్చడానికి కోనసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు పనిగట్టుకుని మరీ ఘర్షణలు చేస్తున్నారనీ చెప్పేసి ఈ సందర్భంగా దుయ్యబట్టారు. వైసిపి కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆవాకులు చవాకులు పేలితే రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురు తిరుగుతారు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత పటిష్టంగా ఉన్న పోలీసు వ్యవస్థ అల్లర్లను అదుపు చేయలేక పోవడం దేనికి నిదర్శనం అని ప్రశ్నించారు. ప్రభుత్వం కోనసీమ ప్రాంతం మొత్తం తమ ఆధీనంలోనే ఉందని అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగడం లేదని ప్రజలను తప్పు దోవ పట్టిస్తుందని తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article