Another Fort Under Golconda Fort
గోల్కొండ భూగర్భంలో మరో కోట
తవ్వకాల్లో బయటపడుతున్న ఆనవాళ్లు
ఏఎస్ఐ నిపుణుల బృందం పరిశీలన
వందల సంవత్సరాల చరిత్ర ఉన్న గోల్కొండ కోట భూగర్భంలో మరో కోట ఉందా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ గోల్ఫ్ కోర్స్ పక్కనే నయాఖిలలో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ఆధీనంలో ఉన్న దాదాపు 40 ఎకరాల భూమిలో గత పది రోజులుగా తవ్వకాలు జరుగుతున్నాయి. అనేక పురాతన వస్తువులు, రాతి శిలలు బయటపడుతున్నాయి. దీన్నిబట్టి భూగర్భంలో ఏదో ఒక కట్టడం ఉండవచ్చు అని ఏఎస్ఐ అధికారులు, చరిత్రకారులు భావిస్తున్నారు. తవ్వకాలలో 15వ శతాబ్దం నాటి శిథిలాలు బయట పడుతుండటంతో.. ఈ ప్రాంతాన్ని ఏఎస్ఐ దక్షిణాది రీజినల్ డైరెక్టర్ మహేశ్వరి శనివారం (డిసెంబర్ 14న) పరిశీలించారు. తవ్వకాలు నిపుణుల ఆధ్వర్యంలో మరింత జాగ్రత్తగా నిర్వహించాలని ఆమె అధికారులను ఆదేశించారు.