భారత సినీమా రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఇండియన్ ఇండర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్- ఐఫా 2024 అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగుతోంది. అబుదాబి వేదికగా ఘనంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో రెండవ రోజు బాలకృష్ణ, వెంకటేశ్, రానా, ఏఆర్ రెహమన్, సమంత హాజరై సందడి చేశారు. ఐఫా వేడుకలో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ నటీనటులు పలు కేటగిరిల్లో అవార్డులు అందుకున్నారు. ఐఫా వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి మరో ప్రతిష్ఠాత్మక అవార్డును కైవసం చేసుకున్నారు. ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా పురస్కారం అందుకున్నారు చిరంజీవి. ఇదే సమయంలో వుమెన్ ఆఫ్‌ది ఇయర్ అవార్డును సమంత గెలుచుకుంది.
ఐఫా-2024 అవార్డులు అందుకున్న వారు..
ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా- చిరంజీవి
ఔట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియన్ సినిమా – ప్రియదర్శన్
గోల్డెన్ లెగసీ అవార్డు – బాలకృష్ణ
వుమెన్ ఆఫ్‌ది ఇయర్ – సమంత
ఔట్ స్టాండింగ్ ఎక్సెలెన్స్ (కన్నడ)- రిషబ్ శెట్టి
ఉత్తమ నటుడు (తెలుగు)- నాని
ఉత్తమ చిత్రం (తమిళం) – జైలర్
ఉత్తమ నటుడు (తమిళం)- విక్రమ్ (పొన్నియిన్ సెల్వన్ 2)
ఉత్తమ నటి (తమిళం) – ఐశ్వర్యారాయ్ (పొన్నియిన్ సెల్వన్ 2)
ఉత్తమ దర్శకుడు (తమిళం) – మణిరత్నం (పొన్నియిన్ సెల్వన్ 2)
ఉత్తమ సంగీత దర్శకుడు (తమిళం) – ఏఆర్ రెహమన్ (పొన్నియిన్ సెల్వన్ 2)