పెట్రోల్ బాటిల్ తో రెవెన్యూ ఆఫీస్ లో హల్ చల్

Another Revenue Issue In Kurnool District

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఘటన మరిచిపోకముందే ఏపీ లోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం లో రెవెన్యూ కార్యాలయంలో పెట్రోల్ బాటిల్ తో ఆత్మహత్య కు ప్రయత్నించటం కలకలం రేపింది . రెవెన్యూ శాఖలో అవినీతి భూ సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యంపై బాధితులు తీవ్ర ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో ఆళ్లగడ్డ మండలం బత్తులూరు గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి దంపతులు రెవెన్యూ అధికారులు వేధిస్తున్నారని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఇక విషయం ఏంటి అంటే సుబ్బారెడ్డి జాతీయ రహదారి పక్కన 11 సెంట్లు స్థలము ఉంది. అయితే ఆ స్థలాన్ని మరో వ్యక్తి అక్రమంగా రెవిన్యూ రికార్డులు ఎక్కించుకున్నారు. స్థలం విషయంలో సుబ్బారెడ్డి ఎన్నిసార్లు రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరిగిన పని కావడంలేదు. దీంతో వారుపెట్రోల్ బాటిల్ ను, పురుగుల మందు డబ్బాలను తీసుకొని వెళ్లి తాసిల్దార్ ఆఫీస్ లో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. స్థానికులు వారిని అడ్డుకుని వారి ఆత్మ హత్యాయత్నాన్ని విరమింపజేశారు. విజయ రెడ్డి సజీవదహనం ఘటన మర్చిపోకముందే చోటు చేసుకున్న ఈ ఘటన తో తెలుగు రాష్ట్రాల్లో రెవిన్యూ కార్యాలయాలలో పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

TAGS : Vijayareddy murder, AP, Kurnool district, Allagadda, revenue office, petrol bottle, suicide attempt, land issue, subba reddy

http://tsnews.tv/laksman-about-national-second-capital/
http://tsnews.tv/rtc-strike-case-postponed-to-18th-november/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *