మహబూబాబాద్ లో  మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య

Another RTC Driver Suicide In Mahabubabad

మహబూబాబాద్ లో మరో ఆర్టీసీ కార్మికుడు ప్రాణాలు వదిలాడు. మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామానికి చెందిన ఆవుల నరేష్ అనే ఆర్టీసీ డ్రైవర్  పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభుత్వ తీరుతో మనస్తాపం చెందిన నరేష్ ఆత్మహత్యకు పాల్పడటంతో ఆర్టీసీ కార్మికుల్లో ఆవేదన నెలకొంది.  గత 15 సంవత్సరాలుగా ఆర్టీసీలో డ్రైవర్ గా విధులు నిర్వర్తిస్తున్న నరేష్  ఆర్టీసీ సమస్య పరిష్కారం కాదేమో అన్న మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  కోర్టు ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో తీర్పు ఇవ్వకపోవడం, ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పట్టించుకోనట్లు ప్రవర్తించడం తో  మనస్తాపం చెందిన నరేష్ మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. ఆర్తీసీకార్మిక్ల కుటుంబాలు దయనీయమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపధ్యంలో ఆర్టీసీ డ్రైవర్ నరేష్  సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తుంది.  ఇక  మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి చేరుకున్న ఆర్టీసీ కార్మికులు నరేష్ మృతితో తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.  డ్రైవర్ నరేష్ మృతదేహంతో ర్యాలీ చేపట్టిన  ఆర్టీసీ కార్మికులు, కార్మిక జేఏసీ నాయకులు ఆర్టీసీ డిపో  ముట్టడికి యత్నించారు. నరేష్ మృతికి కారణం సీఎం కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. డౌన్ డౌన్ కేసీఆర్ అంటూ ఆందోళనకు దిగటంతో డిపో వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

tags : tsrtc strike, rtc strike, rtc driver, naresh suicide, mahabubabad area hospital, rtc depot, police

 

సినీ నటుడు రాజశేఖర్ కు మేజర్ యాక్సిడెంట్

బీజేపీ నెక్స్ట్ టార్గెట్ ఇదేనా ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *