మరో ఆర్టీసీ డ్రైవర్ సూసైడ్

Another RTC Driver Suicide

ఇంకెంత మంది ఆర్టీసీ కార్మికుల బలిదానాలు కావాలి?
రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్న ఆర్టీసీ కార్మికులు..

ఖమ్మం డిపోకు చెందిన శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య చేసుకుని ఇరవై నాలుగు గంటలు గడవక ముందే మరో దారుణం చోటు చేసుకున్నది. రాణిగంజ్ డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ సుదర్శన్ ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. గత కొంతకాలం నుంచి తను ఆర్టీసీ సమస్యలపై పోరాడుతుండటం గమనార్హం. కుల్సుంపురాకు చెందిన సుదర్శన్ మైత్రి ఆస్పత్రిలో మృతి చెందారు. ఆయన మరణవార్త విన్న ఆర్టీసీ నాయకులు, కార్మికులు షాక్ కు గురయ్యారు. దీంతో, ఒక్కసారిగా ప్రభుత్వం మీద భగ్గుమంటున్నారు. ఇంకా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతమంది ఆర్టీసీ కార్మికుల బలిదానాలు కోరుకుంటున్నారంటూ రగిలిపోతున్నారు. ఇలా ఆత్మహత్యలు చేసుకోవడానికే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది? ఒకప్పుడు ఆదుకుంటానని చెప్పి, ఇప్పుడు మాట మరిచే ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పాలన్నంత కసి వీరిలో పెరిగింది.

పాపం అసలే ఆర్టీసీ కార్మికులు.. అంత పెద్దగా చదువుకుంటే ఈ ఉద్యోగంలోకి ఎందుకొచ్చేవారు.. తమ సమస్యల పరిష్కారం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి మొండిపట్టుదలకు వెళుతుండటం వల్లే ఇలాంటి సమస్యలు పుట్టుకొస్తున్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చించి ఏదో ఒక రకంగా సమస్యను పరిష్కరించడం మానేసి.. మొండి పట్టుదలతో వెళ్లి.. కార్మికుల జీవితాలతో ఆడుకోవడానికి అధిక శాతం ప్రజలు కోరుకుంటున్నారు. ఎంతో అపరమేధావి, తెలంగాణ భగీరథుడిగా పేరుగాంచిన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆర్టీసీ సమస్యలను పరిష్కరించడం పెద్ద సమస్య కానే కాదని ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి, ఈ ఆర్టీసీ సమస్యలకు తక్షణమే చరమగీతం పాడాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *