పురుగుల మందు తాగి ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్య?

Another RTC Worker Suicide Attempt 

ఆర్టీసీ కార్మికుల సమ్మె 41 రోజు కొనసాగుతుంది. అయినా ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం కావటం లేదు. దీంతో మనస్తాపం చెందిన ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యల బాట పడుతున్నారు. మూడు నెలలుగా జీతాలు లేక, ఉద్యోగం పోయినట్టే అని ప్రభుత్వం చెప్పటంతో ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ఇక ఆర్టీసీ కార్మిక కుటుంబాలు దయనీయమైన పరిస్థితుల్లో కాలం వెళ్లదీస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే తొర్రూరు ఆర్టీసీ డిపో ( శ్రామిక్ ) మెకానిక్ గా పనిచేస్తున్న మేకల అశోక్ అనే ఆర్టీసీ కార్మికుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మేకల అశోకు స్వస్థలం తొర్రూరు మండలం సోమారం గ్రామం. ఆర్టీసీ సమ్మె 41 రోజులుగా కొనసాగుతున్న తమ సమస్యకు పరిష్కారం దొరకలేదని తీవ్ర మనస్తాపానికి గురైన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది . దీంతో అశోక్ ను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అశోక్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.

tags : tsrtc strike, rtc strike, pesticide, rtc worker, suicide attempt, torrur

కోర్టుపైనే కార్మికుల చివరి ఆశ

రాఫెల్ డీల్ రివ్యూ పిటీషన్లు కొట్టివేస్తూ సుప్రీం తీర్పు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *