కాంగ్రెస్ కు మరో షాక్

ANOTHER SHOCK TO CONGRESS

  • టీఆర్ఎస్ లో చేరనున్న కొల్లాపూర్ ఎమ్మెల్యే
  • కేటీఆర్ తో భేటీ.. త్వరలోనే పార్టీలో చేరతానని వెల్లడి

తెలంగాణలో కాంగ్రెస్ కు షాకులు మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. వరుసగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరిపోతున్నారు. తాజాగా కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్‌ రెడ్డి టీఆర్ఎస్ పార్టలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. బుధవారం ఆయన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సమావేశమయ్యారు. త్వరలో పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరతానని ప్రకటించారు. అవసరమైతే పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తానని వెల్లడించారు. కొల్లాపూర్‌ నియోజకవర్గం అభివృద్ధికి కేటీఆర్‌ హామీ ఇచ్చారని ఈ సందర్భంగా చెప్పారు. ఇప్పటికే కాంగ్రెస్‌ నుంచి పలువురి ఎమ్మెల్యేల చేరికతో తెరాస బలం 100కి చేరింది. నామినేటెడ్‌ ఎమ్మెల్యేతో కలిపి 101 మంది అధికార పార్టీకి మద్దతుగా ఉన్నారు. మరో నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడినట్లయితే అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా పోతుంది. ఇంకా ఐదుగురు ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, వారు కూడా త్వరలోనే టీఆర్ఎస్ లో చేరతారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

TS POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article