టీడీపీకి మరో దెబ్బ .

77
ANOTHER SHOCKING NEWS FOR TDP
ANOTHER SHOCKING NEWS FOR TDP
ANOTHER SHOCKING NEWS FOR TDP
చిత్తూరు మాజీ ఎంపీ నారమల్లి శివప్రసాద్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌‌లో మృతి  చెందారు . నటుడిగా, నిర్మాతగా, రాజకీయనాయకుడిగా శివప్రసాద్ సుపరిచితుడు. తనకు నటనంటే చాలా ఇష్టమని తన జీవితంలో నటన ఓ భాగమైపోయిందని పలు సందర్భాల్లో చెప్పారు. ముఖ్యంగా రాజకీయ వేదికలపై శివప్రసాద్ పోషించే అలనాటి పాత్రలు చాలా మంది ఆసక్తితో తిలకించేవారు. తన డైలాగులతో అందరినీ ఆకట్టుకునే వారు ఈ మాజీ ఎంపీ.
ఏపీ విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ను విభజించరాదని చెబుతూ పలు వేషధారణలతో తన నిరసనను తెలిపారు. ఇక రాష్ట్రం విభజన జరిగిన తర్వాత కూడా విభజన హామీల అమలు కోసం, ప్రత్యేక హోదా సాధన కోసం పోరాడారు. పార్లమెంటు సమావేశాలు జరిగే సమయంలో ప్రతిరోజు ఓ విభిన్నమైన వేషం వేసి ఇటు ప్రాంతీయ మీడియానే కాకుండా అటు జాతీయ మీడియాను కూడా ఆకట్టుకున్నారు. పార్లమెంటు భవనంలోకి వెళ్లే ఇతర ఎంపీలు కూడా శివప్రసాద్ వేసే వేషధారణలను ఆసక్తికరంగా తిలకించే వారు. ఇలా ఒక్కో రకమైన వేషధారణతో తన నిరసన తెలిపేవారు శివప్రసాద్.
చిత్తూరు టీడిపి మాజీ ఎంపి ఎన్ శివప్రసాద్ మృతితో తెలుగుదేశం పార్టీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కోడెల శివప్రసాద్ అకాల మరణంతో తీవ్ర శోక సంద్రంలో ఉన్న టీడిపి శ్రేణులను ఎన్ శివప్రసాద్ మృతి మరింత దుఃఖసాగరంలోకి నెట్టింది. పార్టీలో ఉత్సాహంగా ఉండే శివప్రసాద్ ఇక లేరనే వార్తను నాయకులతో పాటు కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారు. నేతలతో పాటు పార్టీ శ్రేణులతో సరదాగా ఉంటూ హాస్యాన్ని పండించే చిత్తూరు మాజీ ఎంపి మరణం పట్ల పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా శివప్రసాద్ పార్టీకి చేసిన సేవలను కొనియాడుకుంటున్నారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన సమయంలో విభజనకు వ్యతిరేకంగా శివప్రసాద్ వ్యవహరించిన తీరును ఏపి ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు.

Tags : TDP,  former MP shiva prasad ,  died , no more , chennai , chittor,

https://tsnews.tv/trs-mla-fires-on-jeevan-reddy-comments/
https://tsnews.tv/manda-krishna-madiga-interesting-comments-on-kcr/
https://tsnews.tv/reemployment-to-365-members-in-singareni/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here