* తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్(టీఓఎస్ఏ) వార్షిక సదస్సులో డాక్టర్ శ్రీనివాస్ కాషా
*నగరంలో మార్చి 10 నుంచి 12 వరకు సదస్సు
కరోనా వల్ల కలిగే దుష్ప్రభావాల్లోకి కటి ఎముకలకి కలిగే అసాధారణమైన దుష్ప్రభావం పెల్విక్ హిప్ కూడా చేరింది. ఇది ఆటో ఇమ్యూన్ రియాక్షన్లకు, రియాక్టివ్ ఆర్థరైటిస్‌కి కూడా దారితీస్తుందని తాజాగా తెలుస్తోంది. నొప్పి సాధారణంగా తొడ ముందు భాగంలో, కొన్నిసార్లు మోకాలిలో కూడా ఉంటుంది. ఇది కటి దగ్గర జరిగే మార్పుల వల్ల కావచ్చు. దీన్ని ఎవాస్కులర్ నెక్రోసిస్ అంటారు. మొదట్లో నొప్పి, తుంటి భాగంలో బిగువుగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల రోగికి లేచి నిలబడడంలో, మెట్లు ఎక్కడంలో ఇబ్బంది ఎదురవుతుందని టోశా కాన్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ డాక్టర్ శ్రీనివాస్ కాషా తెలిపారు. ఈ నెల 10 నుంచి 12 వరకు నగరంలో జరుగుతున్న తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ (టీఓఎస్ఏ) వార్షిక సదస్సు టోసా కాన్‌లో శనివారం ఆయన మాట్లాడారు.
“ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విభజన తర్వాత ఈ సదస్సును నిర్వహించడం ఇది ఎనిమిదోసారి. ఈ సారి ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం “సాక్ష్యాలు, నైపుణ్యంతో కూడిన ఎక్సలెన్స్”. మెడికల్ కాలేజీల్లో పాఠ్య ప్రణాళిక పాతబడిపోయింది. ఇప్పుడు శాస్త్రీయ దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. జీవితంలోని ఏ దశలో చూసినా, సమాజం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. దాంతోపాటే వైద్యశాస్త్రం కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది. లాక్‌డౌన్ సమయంలో చాలామంది వైద్యులకు సరైన అవగాహన లేదు. కానీ ఇప్పుడు సరికొత్త మందులు, శస్త్రచికిత్సా పద్ధతులు వచ్చాయి. ఇది చికిత్స కోరుకునే రోగుల సమస్యలను ఎదుర్కోవడానికి, కేసులను ప్రాధాన్య ప్రాతిపదికన పరిష్కరించడానికి మాకు సహాయపడింది” అని ఆయన చెప్పారు.
మెడికల్, సర్జికల్ వస్తువులను ప్రదర్శించే 60 స్టాళ్లు, మోకాలి ఆర్థ్రోప్లాస్టీ, నాన్ యూనియన్ లాంగ్ బోన్స్, మణికట్టు, చేతి గాయాలు, పాదం, చీలమండ గాయాల్లాంటి వివిధ ప్రత్యేకతలలో నిర్వహించిన 9 వర్క్ షాప్ లు ఈ సదస్సులో ప్రధానంగా ఉన్నాయి. ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, నిపుణులు, లెర్నింగ్ జూనియర్లు, సహాయక శస్త్రచికిత్సా వైద్యాలతో కూడిన సుమారు 1000కి పైగా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
తెలంగాణ ఆవిష్కరణలు, యువ ఆర్థోపెడిక్ సర్జన్ల సదస్సు కూడా ఉన్నాయి.
తొలిసారిగా తెలంగాణ మహిళా ఆర్థోపెడిక్ సర్జన్లని సెషన్ లో చేర్చారు (డబ్ల్యూఓటీఈ)