అనుపమ పరమేశ్వరన్ ఈ పేరు తెలియనివారుండరు. ప్రేమమ్ సినిమాతో ప్రేక్షకుల మదిలో చదరని ముద్ర వేసుకుంది ఈ భామ. మంచి కథలను ఎంచుకుంటూ.. సోషల్‌మీడియాలో కూడా హద్దులు మీరకుండా సెలక్టివ్‌గా పోస్ట్‌లు పెడుతుంది. సినీ పరిశ్రమలో కూడా ఎంతవరకు ఉండాలో అంత వరకు మాత్రమే ఉంటుంది. అనుపమ అంటే మన ఇంటి అమ్మాయి అనే పేరు తెచ్చుకుంది. ఈ భామ ప్రస్తుతం పెళ్ళికి రెడీ అవుతోందని సోషల్ మీడియాలో వార్తలు షికార్లు కొడుతున్నాయి. ఇంతకీ పెళ్లికొడుకు ఎవరో కాదు మంచి కుటుంబానికి చెందిన కుర్రాడే. ఎవరోకాదు ధృవ్ విక్రమ్. వెర్సటైల్ సీనియర్ హీరో విక్రమ్ కుమారుడు. అనుపమ, ధృవ్‌ల మధ్య ఏదో నడుస్తుందని బాలీవుడ్ మీడియా కొడై కూస్తోంది. వీరిద్దరూ కలిసి ఓ సాంగ్స్ ప్లే లిస్ట్ షేర్ చేసుకుంటున్నారని, దానికి డీపీ వారిద్దరూ కలిసి ముద్దు పెట్టుకుంటున్న ఫొటోను యాడ్ చేస్తున్నారు అంటున్నారు. ఈడూ జోడూ మంచి పెయిర్. అనుపమ వెడ్స్ ధృవ్ అనే కార్డ్ పడుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు.