హాట్ హాట్ భంగిమలతో కూడిన తన ఫొటోల్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ ఈమధ్య అదరగొడుతోంది అనుపమ పరమేశ్వరన్. ఇక్కడ ఆ అదరగొట్టడం గురించే కాదు మేం చెబుతోంది, అవకాశాల విషయంలోనూ ఆమె అదే జోరు ప్రదర్శిస్తోందన్నదే సంగతి.తెలుగులో ఆచితూచి సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ పొరుగు భాషలపై కూడా ప్రధానంగా దృష్టి పెడుతోందని స్పష్టమవుతోంది.అందులో భాగంగానే తమిళంలో కథానాయిక ప్రాధాన్యం ఉన్న ఓ అదిరిపోయే సినిమాని చేజిక్కించుకుందని సమాచారం. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
నాలుగైదు రోజుల్లోనే ఈ సినిమా మొదలు కానున్నట్టు తెలుస్తోంది. తెలుగులో `టిల్లు స్క్వేర్` సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ సరసన నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ, కొత్తగా సినిమాలేవీ ఒప్పుకోలేదు. చాలా ఛూజీగా ఉంటోంది. ఏది పడితే అది చేయడం కాకుండా…తనకి నచ్చిన కథలకే ఓకే చెబుతోంది. ఇటీవలే తమిళ దర్శకుడు ఓ కథని వినిపించడంతో దానికి సై చెప్పిందట. ఇప్పుడు ఏ భాషలో సినిమా అయినా అది అన్ని భాషల్లోకి రావడం ఖాయం కాబట్టి ఆ సినిమా తెలుగు ప్రేక్షకుల్నీ అలరించనుందన్నమాట.అన్నట్టు ఈమె కాన్సంట్రేషన్ అంతా ఇప్పుడు డైరెక్షన్ మీద ఉన్నట్టు సమాచారం.నాలుగైదేళ్లలో పూర్తిస్థాయి డైరెక్టర్‌గా మారిపోయి తన సినిమాలతో అలరించాలని ప్రయత్నిస్తోందట. అందుకోసం కథల్ని కూడా సిద్ధం చేసుకొంటోందని సమాచారం.