భ‌క్తి చిత్రంలో అనుష్క‌

Spread the love

Anushka in devotional film

లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు ప్ర‌స్తుత జ‌న‌రేష‌న్‌లో అనుష్క ఓ ట్రేడ్ మార్క్‌గా నిలిచారు. అరుంధ‌తి, రుద్ర‌మ‌దేవి, భాగ‌మ‌తి వంటి సినిమాలు స‌హా.. బాహుబ‌లిలో ఆమె పోషించిన దేవ‌సేన‌ పాత్ర‌కు త‌న‌దైన న‌ట‌న‌తో ప్రాణం పోసింది. ప్ర‌స్తుతం `సైలెన్స్‌` అనే ఓ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌లో న‌టిస్తుంది. ఇది కాకుండా ఈ ఏడాదిలోనే అయ్య‌ప్ప‌స్వామిపై చేయ‌బోయే ఓ భ‌క్తి ప్ర‌ధాన చిత్రంలో న‌టించనుంది స్వీటీ. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ సంతోష్ శివ‌న్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో ఈ చిత్రాన్నివిడుద‌ల చేస్తారు. సెప్టెంబ‌ర్ లేదా అక్టోబ‌ర్ నుండి సినిమాను సెట్స్‌లోకి తీసుకెళ్ల‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నారు. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన అధికారిక స‌మాచారం రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *