ఏపీలో 111 కరోన పాజిటివ్ కేసులు

AP 111 CORONA POSITIVE CASES

ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు హఠాత్తుగా 111కి పెరిగాయి. బుధవారం సాయంత్రం ఏడు గంటల తర్వాత రిపోర్టుల్లో కొత్తగా ఇరవై కేసులు పాజిటివ్గా నిర్థారణ అయ్యాయి. ఒక్క రోజులో అరవై ఏడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క కృష్ణా జిల్లా లో 6 నుండి 15కి పాజిటివ్ కేసులు చేరాయి. ఇక, దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 1834కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ  ప్రకటించింది. ప్రస్తుతం 1649 మందికి చికిత్స కొనసాగుతున్నది.  దీన్ని బారిన పడిన వారిలో ఇప్పటివరకూ 143 మంది కోలుకున్నారు.

కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 41 మంది మృతి చెందడం గమనార్హం.

ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. కరోనా వైస్ ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది లక్షల మందికి చేరుకున్నది.

యూనైటెడ్ కింగ్ డమ్, ఇరాన్ వంటి దేశాల్లో మూడు వేలకు పైగా మరణించారు.

అమెరికాలో అయితే మరణాల సంఖ్య నాలుగు వేలను దాటేసింది.

 

CORONA LIVE UPDATES

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *