తెలంగాణపై ఏపీ మూడురాజధానుల ఎఫెక్ట్..

AP 3 Capital Issue Impacts On Telangana

ఏపీలో  మూడు రాజధానుల రచ్చ కొనసాగుతుంది . ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు ఆలోచనపై మిశ్రమ స్పందన వస్తుంది .  ఏపీ అసెంబ్లీ సమావేశాల చివరి రోజున   ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి  మూడు రాజధానులు ఏర్పాటు చేసిన ప్రకటనతో తెలంగాణలోనూ కొత్త డిమాండ్లు  తెర మీదకు వస్తున్నాయి.అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని,  అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో, మూడు  రాజధానులను ఏర్పాటు చేస్తే బాగుంటుందని  సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.  ఇక తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలకు  తెలంగాణ రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల నుండి  కొత్త డిమాండ్ వినిపిస్తుంది. .

 తాజాగా ఇకపై అసెంబ్లీ సమావేశాలు ఆదిలాబాద్‌లో నిర్వహించాలంటూ  బిజెపి ఎంపీ సోయం బాపూరావు డిమాండ్ చేశారు.  ఆదిలాబాద్ జిల్లా బాగా వెనుకబడిన జిల్లా  అని, ఆదిలాబాద్ లో ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవని  అందుకే ఏడాదిలో రెండుసార్లు ఆదిలాబాద్‌లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని   బిజెపి ఎంపీ సోయం  బాపూరావు కోరారు. ఆదిలాబాద్‌లో అసెంబ్లీ సమావేశాలపై గవర్నర్‌ను కలుస్తామని బాపూరావు వెల్లడించారు.  ఏది ఏమైనా  ఏపీ రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల  ప్రభావం తెలంగాణ రాష్ట్రం మీద స్పష్టంగా కనిపిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *