హస్తినలో చట్ట సభల్లో ఏపీ రాజధాని రగడ

153
AP 3 Capital War
AP 3 Capital War

AP 3 Capital War At Parliament

ఏపీ రాజధాని వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారుతుంది. పార్లమెంట్ లోనూ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని అంటున్న జనం గొంతుకను పార్లమెంట్ లో వినిపిస్తున్నారు టీడీపీ ఎంపీలు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులను ఏర్పాటు చేయడం సరికాదన్న జయదేవ్.. మూడు రాజధానులతో ఏపీకి అనేక సమస్యలు వస్తాయన్నారు.
దీనిపై స్పందించిన లోక్ సభ డిప్యూటీ స్పీకర్ ఎ.రాజా.. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోని అంశమని అన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని సమస్య రాష్ట్ర సమస్య కాదని.. జాతీయ సమస్య అని అన్నారు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్. అయితే..రాజధానిపై జయదేవ్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ ఎంపీలు అడుగడుగునా అడ్డుతగిలారు.రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిణామాలను రాష్ట్ర పరిధిలో కాకుండా..రాష్ట్ర విభజన చేసిన కేంద్రం పరిధిలోని అంశంగా భావించాలని టీడీపీ ఎంపీలు తమ వాదన వినిపించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా తెచ్చుకోలేని స్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని..టీడీపీ ఎంపీలు మండిపడ్డారు. 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేకహోదా సాధిస్తామన్న జగన్ మాటలు ఏమయ్యాయని నిలదీశారు.అటు రాజ్యసభలోనూ ఏపీకి సంబంధించిన అంశాలను ప్రస్తావించినట్లు టీడీపీ ఎంపీలు వివరించారు. ఇక ఢిల్లీ లో చట్ట సభల వేదికగా రాజధాని అమరావతి కోసం పోరాటం సాగిస్తున్నారు టీడీపీ ఎంపీలు.

AP 3 Capital War At Parliament,#parliament,rajya sabha,Lok sabha,#APCapital

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here