ఈనెల 30 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

AP Assembly meetings are held this Month

ఈనెల 30 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఎన్నికలకు ముందు జరగబోయే చివరి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలలో ఏ అంశాలకు ప్రాధాన్యత ఇస్తారు అన్న ఆసక్తి ఏపీలో నెలకొంది. ఒకపక్క మొన్నటివరకు అసెంబ్లీలో కాలు పెట్టని ప్రతిపక్ష పార్టీ సైతం ఈసారి అసెంబ్లీ కి వెళ్లాలని సమావేశాల్లో పాల్గొనాలని చూస్తోంది. ఇక ఎన్నికలకు ముందు జరుగుతున్న చివరి అసెంబ్లీ సమావేశాలు కాబట్టి అధికార పార్టీ చాలా వ్యూహాత్మకంగా ఈ సమావేశాలకు సన్నద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజూ గవర్నర్‌ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని స్పీకర్ కోడెల శివప్రసాద్ చెప్పారు. 70వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అసెంబ్లీ ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేశారాయన. అనంతరం మాట్లాడుతూ.. ఈ నెల 31 న మృతి చెందిన సభ్యులకు సంతాప తీర్మానాలు ఉంటాయన్నారు. ఫిబ్రవరి 1,2,3 తేదీల్లో అసెంబ్లీకి సెలవని, 4న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుందని చెప్పారు. ఫిబ్రవరి 5న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 6 నుంచి 8 వరకూ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై చర్చ ఉంటుందని స్పీకర్ స్పష్టం చేశారు. కాగా గత ఏడాది లక్షా 93 వేల కోట్లుగా ఉన్న బడ్జెట్ ఈసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ రెండు లక్షల కోట్లు దాటనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article