ఏపీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్

AP Budget …. ఎన్నికలే టార్గెట్

ఏపీ అసెంబ్లీ లో ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అమరావతిలో ఇది మూడో బడ్జెట్ అంటూ వరసగా రెండంకెల వృద్ధి సాధించామని తెలిపారు యనమల రామకృష్ణుడు. ఇక తాను 11వ సారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నానని , దేశానికి మార్గదర్శనం చేసే స్థాయికి చేరామని చెప్పారు. ఊహించని ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామన్న ఆయన ఈజ్ ఆఫ్‌ డూయింగ్‌లో ఏపీ నెంబర్‌ వన్‌ అని ప్రజలు ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. రైతుల, అసంఘటిత కార్మికులను ఆదుకున్నామని అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు ఆనందంగా ఉన్నారని తెలిపిన ఆయన పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయన్న పేరొచ్చిందని చెప్పారు.
నిరంతర విద్యుత్, ఆరోగ్యం, విద్య పరిపుష్టంగా ఉంది 2014లో స్వయం సహాయక సంఘాలపై ఆర్థిక ఒత్తిడి ఐదేళ్లలో దాన్ని సమూలంగా మార్చేశామని పేర్కొన్నారు. పసుపు-కుంకుమ పథకంతో ఆడపడుచులకు చేయూత ఇచ్చామని డ్వాక్రా సంఘాలకు ఆర్థిక చేయూతనిచ్చామని పేర్కొన్నారు. ఇంటింటికి పెదన్నగా చంద్రబాబును చూస్తున్నారన్న యనమల ఉన్నత విద్యకు రూ.3171 కోట్లు, పౌరసరఫరాల శాఖకు రూ.3763 కోట్లు కేటాయించామని చెప్పారు. ఈ బడ్జెట్‌లో రైతన్న కోసం మరో వినూత్న పథకం అన్నదాత సుఖీభవకు సర్కార్ శ్రీకారం చుట్టిందని ప్రకటించారు. బడ్జెట్ అంచనా రూ.2.26 లక్షల కోట్లు రెవెన్యూ వ్యయం రూ.1.80 లక్షల కోట్లు కేపిటల్‌ వ్యయం రూ.29 వేల 596 కోట్లు ,రెవెన్యూ మిగులు రూ.2099.47 వేల కోట్లు ఆర్థిక లోటు రూ.32,390,68 కోట్లు గా వుందని ఆయన తెలియజేశారు. హోంశాఖకు రూ.6297 కోట్లు, ఐటీ శాఖకు రూ. 1006 కోట్లు, మైనారిటీ శాఖకు రూ. 1308 కోట్లు, ఆహార శుద్ధి పరిశ్రమకు 300 కోట్లు ,వైద్య శాఖకు రూ. 10,032 కోట్లు, పశుగ్రాసం అభివృద్ధికి రూ.200 కోట్లు, సాంఘిక సంక్షేమ శాఖ రూ.6861 కోట్లు, యాంత్రీకరణకు రూ.300 కోట్లు, అన్నదాత సుఖీభవకు రూ.5 వేల కోట్లు, ఇళ్ల స్థలాల అభివృద్ధికి రూ.500 కోట్లు, డ్రైవర్‌ సాధికార సంస్థకు రూ.150 కోట్లు, క్షత్రియుల సంక్షేమానికి రూ. 50 కోట్లు, మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ఫండ్‌ రూ.వెయ్యి కోట్లు, పశువులపై బీమా కోసం రూ.200 కోట్లు, చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం రూ.400 కోట్లు, వెనుకబడిన కార్పొరేషన్‌కు రూ.3 వేల కోట్లు, ధరల స్థిరీకరణకు రూ.వెయ్యి కోట్లు కేటాయింపులు చేశారు. నిరుద్యోగ భృతి రూ.1200లకు పెంపు చేసినట్టు ప్రకటించారు. ఎన్టీఆర్ విదేశీ విద్యారణ పథకానికి రూ.100 కోట్లు ,బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ. 100 కోట్లు, డప్పు, కళాకారుల పెన్షన్‌కు రూ.108కోట్లు, గృహ నిర్మాణాలకు రూ.4079 కోట్లు, పరిశ్రమలు, వాణిజ్యానికి రూ.4113 కోట్లు, కార్మిక ఉపాధి కల్పనకు రూ.1225 కోట్లు, శాసనసభా వ్యవహారాలకు రూ.149 కోట్లు, ప్రభుత్వ రంగ సంస్థలకు 2.65 కోట్లు, విత్తనాభివృద్ధికి రూ.200 కోట్లు ,ఎస్సీ ఉప ప్రణాళికకు రూ.14367 కోట్లు, ఎస్టీ ఉప ప్రణాళికకు రూ. 5385 కోట్లు, మైనారిటీ దుల్హన్‌ పథకానికి రూ. 100 కోట్లు, చంద్రన్న పెళ్లి కానుకకు రూ.128 కోట్లు కేటాయించారు. మొత్తానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో భారీ కేటాయింపులు చేసిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article