మూడు రాజధానులు నిర్ణయం : 20వ క్యాబినెట్

115
AP Cabinet Meeting On 20th
AP Cabinet Meeting On 20th

AP Cabinet Meeting On 20th

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఈ నెల 20వ తేదీన ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సందర్భంగా హై పవర్‌ కమిటీ నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. రాజధాని సహా రాష‍్ట్రంలో  అభివృద్ధి వికేంద్రీకరణపై సభలో చర్చించే అవకాశం ఉంది. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి జీఎన్‌ రావు నేతృత్వంలోని కమిటీ సిఫార్సులు, బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ ఇచ్చిన నివేదిక, గతంలో కేంద్రం వేసిన శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికలోని అంశాలపై అసెంబ్లీలో చర్చించనున్నారు.  అలాగే ఈ నెల 18న కేబినెట్‌ భేటీ కానుంది.
ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల పైన అధికారిక నిర్ణయం దిశగా ముహూర్తం నిర్ణయించింది ప్రభుత్వం . ఇప్పటికే జీఎన్ రావు, బోస్టన్ కమిటీలు ఇచ్చిన నివేదిక పైన ప్రభుత్వం హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ రెండు సార్లు సమావేశమైంది. ఈ నెల 17న ప్రభుత్వానికి హైపవర్ కమిటీ నివేదిక అందించనుంది. ఆ వెంటనే 18న ఏపీ కేబినెట్ ప్రత్యేకంగా ఇదే అంశం పైన సమావేశమై..కమిటీ నివేదికలోని సిఫార్సు లకు ఆమోదం తెలపనుంది. ఇక, ఈ నెల 20న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సమావేశం ద్వారా సభలోనే అన్ని పార్టీలు..ఎమ్మెల్యేలు మూడు రాజధానుల పైన ప్రభుత్వం సుదీర్ఘ వివరణ ఇవ్వనుంది. దీని కోసం ఉభయ సభల సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఆ సమావేశంలోనే ముడు రాజధానులకు అనుకూలంగా తీర్మానం ప్రవేశ పెట్టి అధికారికంగా ఆమోద ముద్ర వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మధ్యలో ఎటువంటి ఇబ్బందులు లేకపోతే..ఈ నెల 20న అసెంబ్లీలో మూడు రాజధానులకు ఆమోదం లభించనుంది.

AP Cabinet Meeting On 20th,Andhra pradesh, assembly meet, high power committe, gn rao committe, boston committe, three capitals , official announcement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here