AP CABINET SWORN IN
- సుచరితకు హోంశాఖ
- ఐదుగురికి డిప్యూటీ సీఎం హోదా
- బొత్సకు మున్సిపల్.. బుగ్గనకు ఆర్థిక శాఖ
ఆంధ్రప్రదేశ్ నూతన కేబినెట్ కొలువు తీరింది. అఖండ మెజార్టీతో అధికార పగ్గాలు చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్ శనివారం ప్రమాణం చేసింది. మొత్తం 25 మంత్రుల చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. వెలగపూడిలోని సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై కొత్త మంత్రులు ప్రమాణం చేశారు. అనంతరం వారికి శాఖలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కొత్త మంత్రుల్లో ఆళ్లా నాని, అంజాద్ బాషా, నారాయణ స్వామి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పుష్ప శ్రీవాణిలకు ఉప ముఖ్యమంత్రి హోదా లభించింది. కీలకమైన హోంశాఖను ప్రత్తిపాడు నుంచి ఎన్నికైన మేకతోటి సుచరితకు అప్పగించారు. ఇక పార్టీలో సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు మున్సిపల్ శాఖ బాధ్యతలు కట్టబెట్టారు.
ఎవరికి ఏ శాఖ ఇచ్చారంటే…
ధర్మాన కృష్ణదాస్ – రోడ్లు, భవనాలు
బొత్స సత్యనారాయణ – మున్సిపల్, అర్బన్ డెవలప్మెంట్
పాముల పుష్పశ్రీవాణి – గిరిజన సంక్షేమ శాఖ
అవంతి శ్రీనివాస్ – టూరిజం, సాంస్కృతిక, యువజన వ్యవహారాలు
కురసాల కన్నబాబు – వ్యవసాయం, సహకార శాఖ
పిల్లి సుభాష్‌చంద్రబోస్ – రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపులు
పినిపే విశ్వపరూప్ – సాంఘిక సంక్షేమం
ఆళ్ల నాని – ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య
చెరుకువాడ శ్రీరంగనాథరాజు – గృహ నిర్మాణం
తానేటి వనిత – మహిళా, శిశు సంక్షేమం
కొడాలి నాని – పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ
పేర్ని నాని – రవాణా, సమాచార శాఖ
వెల్లంపల్లి శ్రీనివాస్ – దేవాదాయ
మేకతోటి సుచరిత – హోం, విపత్తు నిర్వహణ
మోపిదేవి వెంకటరమణ – పశు సంవర్థకం, మత్స్య, మార్కెటింగ్
బాలినేని శ్రీనివాస్‌రెడ్డి – అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ
ఆదిమూలపు సురేశ్ – విద్యా శాఖ
అనిల్‌కుమార్ యాదవ్ – నీటిపారుదల
మేకపాటి గౌతమ్‌రెడ్డి – పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు
కళత్తూరు నారాయణస్వామి – ఎక్సైజ్, వాణిజ్య పన్నులు
బుగ్గన రాజేంద్రనాథ్ – ఆర్థిక, ప్రణాళిక, అసెంబ్లీ వ్యవహరాలు
గుమ్మునూరు జయరామ్ – కార్మిక, ఉపాధి శిక్షణ, కార్మాగారాలు
షేక్ అంజాద్ బాషా – మైనార్టీ సంక్షేమం
మాలగుండ్ల శంకర్ నారాయణ – బీసీ సంక్షేమం