మాజీమంత్రులపై సీఐడీ కేసులు..అందుకేనా?

147
AP CID Booked Cases On TDP Ex Ministers
AP CID Booked Cases On TDP Ex Ministers

AP CID Booked Cases On TDP Ex Ministers

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులప్రకటన ఆ తర్వాత రోజుకో రకంగా మారుతున్న పరిణామాలు ఏపీలో రాజకీయ యుద్ధాలకు కారణం అయ్యింది. నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగాయి.ఒకరి మీద ఒకరు చేసుకున్న ఆరోపణలే కాదు కేసులతోనూ రాజకీయం రసకందాయంలో పడింది. తాజాగా ఇన్ సైడర్ ట్రేడింగ్ చేశారంటూ ఇద్దరు టీడీపీ మాజీ మంత్రులపై  సీబీసిఐ డీ కేసులు నమోదు చెయ్యటం కలకలంగా మారింది .

ఒక పక్క ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా కొనసాగుతున్నాయి. మరోపక్క టీడీపీ నేతలపై రాజధాని భూముల విషయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఏపీ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తుంది .రాజధాని ఏరియాలో  ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని  టీడీపీ నేతలు, మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణలపై సీఐడీకి ఫిర్యాదు చేయడం రాజకీయ దుమారం రేపుతోంది. తమను బెదిరింది భూమిని లాక్కున్నారంటూ బుజ్జమ్మ అనే మహిళ చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసింది సీఐడీ.
గుంటూరు జిల్లా వెంకటపాలెంకు చెందిన బుజ్జమ్మకు 90 సెంట్ల అసైండ్ భూమి ఉంది. దాన్ని మాజీ మంత్రులు లాక్కున్నారని ఆమె సీఐడీకి ఫిర్యాదు చేసింది. బుజ్జమ్మ ఫిర్యాదు ఆధారంగా.. మాజీ మంత్రులపై సెక్షన్ 420 506, 120/బి కింద సీఐడీ కేసులు పెట్టింది. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండిచారు ప్రత్తిపాటి పుల్లారావు. అవి పూర్తిగా అవాస్తవాలని.. కావాలనే మాపై ఈ రకంగా బురద జల్లాలని చూస్తున్నారంటూ పుల్లారావు  మండిపడ్డారు.

AP CID Booked Cases On TDP Ex Ministers,Capital amaravati, CM YS Jagan Mohan Reddy, YCP government, insider trading ,tdp leaders,CBCID, cases , narayana , prattipati pullarao ,former ministers

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here