హస్తిన వేదికగా చంద్రబాబు ధర్మపోరాట దీక్ష

AP CM DHARMAPORATA DHIKSHA AT HASTINA

కేంద్ర ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేసిందనీ, విభజన చట్టం హామీలు అమలు చేయాలని కోరూతూ సీఎం చంద్రబాబు ఫిబ్రవరి 11 న ఢిల్లీలోని ఏపీ భవన్ వేదికగా చేపట్టే ధర్మపోరాట దీక్షకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే సెంట్రల్ ఢిల్లీలో భారీగా చంద్రబాబు ధర్మపోరాట దీక్ష పోస్టర్లు వెలిశాయి. అశోక రోడ్, మాన్ సింగ్ రోడ్, రఫి మార్గ్, జన్ పథ్ లలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 11న ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు చంద్రబాబు దీక్ష చేస్తారు. దీక్ష కోసం కోటి 12 లక్షల రూపాయల ఖర్చుతో ఏపీ ప్రభుత్వం 2 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఒక్కో రైలులో 20 బోగీలు ఉన్నాయి. శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల నుంచి ఈ రైళ్లు ఇప్పటికే ఢిల్లీ బయలు దేరాయి. ఆదివారం ఉదయం 12 గంటలకు రైళ్లు ఢిల్లీ చేరుతాయి. చంద్రబాబు దీక్షకు బీజేపీ యేతర విపక్ష పార్టీలకు చెందిన పలువురు జాతీయ స్ధాయి నేతలు ఏపీ భవన్ కు వచ్చి మద్దతు తెలపనున్నారు. రాష్ట్రప్రభుత్వం ఈదీక్షకు మద్దతుగా పలు ఎన్జీవో సంఘాలను, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకు వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనంతో దీక్షలు చేపట్టటం పట్ల వైసీపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు నాలుగేళ్ళ పాటు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై మాట్లాడకుండా ఇప్పుడు కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగంచేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article