శాసనమండలి రద్దు చేస్తారా జగన్?

87
AP CM Wants To Abolish Legislative Council?
Why AP CM Wants To Abolish Legislative Council?

AP CM Wants To Abolish Legislative Council?

ఏపీ శాసనమండలి రద్దు యోచనలో జగన్ సర్కార్ . శాసన మండలిలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ సభ్యులు ఉండటం, ఏపీ వికేంద్రీకరణ బిల్లుకు అడ్డుకట్ట పడటాన్ని నివారించడంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివాదాస్పదమైన నిర్ణయానికి తీసుకోవడానికి వెనకాడట్లేదని తెలుస్తోంది.వైఎస్ జగన్ అత్యవసర మంత్రివర్గ సమావేశం నిర్వహించి శాసనమండలి రద్దుకు నిర్ణయం తీసుకోనున్నారు.   ఈ రాత్రికే వెలగపూడిలోని సచివాలయం లేదా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ ఏర్పాటు కానుంది. అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నందున ప్రస్తుతం మంత్రులందరూ అందుబాటులోనే ఉన్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలోనే ఉన్నారు. మంత్రివర్గ సమావేశానికి సంబంధించిన సమాచారం ఇప్పటికే వారందరికీ చేరింది.

ప్రస్తుతం శాసన మండలిలో తెలుగుదేశం పార్టీ కి భారీ సంఖ్యలో సభ్యులు ఉన్నారు. ఇక్కడ టీడీపీదే ఆధిపత్యం. మొత్తం 58 స్థానాలు ఉన్న శాసన మండలిలో 26 మంది సభ్యులు టీడీపీకి చెందిన వారే. మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఒకరకంగా చెప్పాలంటే ప్రతిపక్ష పాత్రే. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి తొమ్మిదిమంది సభ్యులు మాత్రమే ఉన్నారు. శాసనసభలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ, మండలిలో మెట్టు దిగక తప్పని పరిస్థితి ఎదురైంది.  ఇక శాసనమండలి రూల్‌బుక్‌లోని 71వ నిబంధనను ప్రయోగించడం ద్వారా ఏపీ వికేంద్రీకరణ బిల్లును విజయవంతంగా అడ్డుకోగలిగింది తెలుగుదేశం పార్టీ.  ఈ వ్యవహారాన్ని చూస్తూ ఊరుకోకూడదని, ఏపీ వికేంద్రీకరణ బిల్లు కోసం ఎంత దాకైనా వెళ్లి తీరాల్సిందేననే పట్టుదల ప్రస్తుతం వైఎస్ జగన్‌లో కనిపిస్తోందని అంటున్నారు. ఇక ఈ నేపధ్యంలోనే శాసనమండలిని రద్దు చేయడానికి కూడా వెనుకాడట్లేదని చెబుతున్నారు.

Why AP CM Wants To Abolish Legislative Council?,ap legeslative council, rule 71

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here