ఎడ్యుకేషన్‌ యాక్ట్‌ సవరణ బిల్లు ఆమోదం

AP Education Act Bill Passed

రాష్ట్రంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్ర‌వేశ‌పెట్టాల‌ని సిఎం వైయ‌స్ జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. అయితే ఇంగ్లీష్ విధానంపై విప‌క్షాలు అడ్డుచెప్పాయి. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఇంగ్లీష్ మీడియా ప్ర‌వేశ‌పెడితే తెలుగు భాష చ‌చ్చిపోతుందంటూ ప్ర‌తిప‌క్షాలు ప్ర‌చారం చేశాయి. అయితే ఇదే విష‌యంపై వెన‌క్కు త‌గ్గ‌ని వైసీపీ ప్ర‌భుత్వం నేడు ఆ బిల్లును ప్ర‌వేశ‌పెట్టింది. ఈ మేర‌కు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఎడ్యుకేషన్‌ యాక్ట్‌ సవరణ బిల్లుకు శాసన సభ గురువారం ఆమోదం తెలిపింది. అదే విధంగా ఈ బిల్లుకు మండలి చేసిన సవరణలను తిరస్కరించింది. ఇక బిల్లు ఆమోదం అనంత‌రం సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ…పేదవాడికి మంచి జరగాలని బిల్లు ప్రవేశపెడితే టీడీపీ సభ్యులు ప్రతీసారి అడ్డుకుంటున్నారని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

AP Education Act Bill Passed,cm ys jagan,ap governament,english medium,opposition,ap govt schools,AP Assembly,education act amendment bill

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article