ఆనందయ్య మందులకు గ్రీన్ సిగ్నల్

62

కంట్లో వేసే డ్రాప్స్‌ తప్ప ఆనందయ్య ఇస్తున్న మందులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. కె అనే మందును కూడా కమిటీ ముందు చూపించలేదు కాబట్టి దీనికి నిరాకరించింది. ఆనందయ్య ఇచ్చే పి, ఎల్, ఎఫ్‌ మందులకు గ్రీన్‌ సిగ్నల్‌ మంజూరు చేసింది. సీసీఆర్‌ఏఎస్‌ నివేదిక ప్రకారం నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం
కంట్లో వేసు మందుపై నివేదికలు రావాల్సి ఉన్నాయి. ఆనందయ్య ఇస్తున్న మిగిలిన మందుల వల్ల హాని లేదని తేల్చిన నివేదికలు. సీసీఆర్‌ఏఎస్‌ నివేదిక ప్రకారం ఆనందయ్య మందు వాడితే హాని లేదన్నారు. కానీ, ఆనందయ్య మందు వాడితే కోవిడ్‌ తగ్గుతుంది అనడానికి నిర్ధారణలు లేవని తేల్చి చెప్పారు.

కంట్లో వేసే డ్రాప్స్‌ విషయంలో పూర్తి నివేదికలు రావాల్సి ఉంది. ఇందుకు మరో
2–3 వారాల సమయం పడుతుంది. ఆనందయ్య మందు వాడినంత మాత్రాన మిగిలిన మందులు ఆపొద్దని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూ.. ఎవరి ఇష్టాను సారం వారు ఆనందయ్య మందును వాడుకోవచ్చు. ఆనందయ్య మందును తీసుకోవడానికి కోవిడ్‌ పాజిటివ్‌ రోగులు రాకుండా ఉండాలన్న రాష్ట్ర ప్రభుత్వం. వారికి బదులుగా వారి సంబంధీకులు వచ్చి మందును తీసుకెళ్తే.. కోవిడ్‌ విస్తరించే ప్రమాదం తప్పుతుందన్న రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. మందు పంపిణీ సందర్భంలో కోవిడ్‌ ప్రోటోకాల్‌ పాటించాలని సూచించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here