ఏపీలో కేజీ రూ. 25

AP govt supplying onions at Rs 25 per Kg

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా నడుస్తున్నాయి. మొదటి రోజే అధికార పక్షానికి, ప్రతిపక్షానికి మాటల యుద్ధం నడిచింది. ఇక తాజా పరిణామాలపై చర్చలో ఉల్లి ధర చర్చకు వచ్చింది. ఈ మేరకు ఏపీ సీఎం జగన్ ప్రసంగించారు. రాష్ట్రంలో ఉల్లి దొరకడం లేదని షోలాపూర్, ఆల్వార్‌ నుంచి కొనుగోలు చేస్తున్నామని వివరణ ఇచ్చిన జగన్ పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని రైతు బజార్లలో కేజీ రూ.25కే విక్రయిస్తున్నామని అన్నారు. అయితే చంద్రబాబు హెరిటేజ్‌ షాపుల్లో మాత్రం ఉల్లి కేజీ రూ.200 అంటూ సెటైర్లు పేల్చారు సీఎం జగన్. ఇక ఇప్పటికే 36,536 క్వింటాళ్ల కొనుగోలు చేశామన్నారు. అదేవిధంగా ఇదే అంశంపై చంద్రబాబు సీఎం గా ఉన్న సమయంలో ఉల్లికి గిట్టుబాటు ధర లభించక పొలాల్లోనే వదిలేశారు రైతులు అంటూ గురు చేశారాయన.ఇకపోతే దేశవ్యాప్తంగా ఉల్లి ధర ఆకాశాన్నంటింది. ఉల్లిని కొనాలంటేనే హడలిపోతున్నారు సామాన్య ప్రజానీకం.

AP govt supplying onions at Rs 25 per Kg,AP only State to supply onions at Rs 25,Andhra Pradesh government,subsidy,Chandrababu,AP CM Jagan,Y. S. Jaganmohan Reddy,AP Assembly Sessions

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article