అమరావతిలో అసైన్డ్ భూముల రద్దు

137
AP Gvt Cancels the allotment of Assigned Lands
AP Gvt Cancels the allotment of Assigned Lands

AP Gvt Cancels the allotment of Assigned Lands

సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజధాని విషయంలో సూచనప్రాయంగా  మూడు రాజధానులు  ఉంటే బాగుంటుందని ఏపీ అసెంబ్లీలో ప్రకటన చేసిన నేపథ్యంలో రాజధాని రైతుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.  ఇదే సమయంలో రాజధాని అమరావతి లోని భూముల విషయంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
రాజధాని అమరావతి పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన వారికి ల్యాండ్ పూలింగ్ కింద సీఆర్డీఏ కేటాయించిన ప్లాట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  గత టిడిపి ప్రభుత్వ హయాంలో  ల్యాండ్ పూలింగ్ కింద సి ఆర్ డి ఎ  అసైన్డ్ భూములను సేకరించి వాటికి బదులుగా ప్లాట్లను ఇచ్చింది.  ఇక ల్యాండ్ పూలింగ్  చట్టం 2015 ప్రకారం రాజధాని నిర్మాణానికి సేకరించిన భూములను  చాలావరకు అసైన్డ్ భూములు ఉన్నాయి.  దళితులు, పేదలకు గతంలో మంజూరు చేసిన అసైన్డ్ భూములను రాజకీయ నేతలు నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసి,  సీఆర్డీఏ కు వాటిని  భూసేకరణ కోసం ఇచ్చి  దానిద్వారా వాణిజ్య, నివాస స్థలాలను తీసుకున్నారు.అసైన్డ్ భూములను కొనుగోలు చేయడం ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్  ఫర్ యాక్ట్ 1977 చట్టం ప్రకారం చట్టవిరుద్ధమైన పని.  అసైన్డ్ భూములను సేకరించి వాటికి బదులుగా ప్లాట్లు కేటాయించడం కూడా నిబంధనలకు విరుద్ధమైన  పని.   అయితే  ఇది అక్రమమని భావించిన,  నిబంధనలకు విరుద్ధమని భావించినప్పుడు సర్కార్ సిఆర్డిఏ కేటాయించిన ఫ్లాట్ లను రద్దు చేసింది. అసైన్డ్‌ భూములు కొనుగోలు చేసిన వారికి సీఆర్‌డీఏ కేటాయించిన ప్లాట్లను రద్దు చేస్తూ పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

AP Gvt Cancels the allotment of Assigned Lands,cm jagan, cm jagan mohan reddy, #amaravati, assigned lands, crda polts , #cancelled,land pooling , illegal,#CRDA

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here