హోలీ రోజున వైసీపీకి రంగు పడింది

AP HC SHOCK TO YCP

రంగుల పండుగ హోలీ రోజున ఏపీలోని అధికార పార్టీ వైఎస్సార్ సీపీకి రంగు పడింది. ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన పార్టీ రంగులను వెంటనే తొలగించాలని హైకోర్టు స్పష్టంచేసింది. పది రోజుల్లో ఈ పని పూర్తి చేసి, సీఎస్ నిర్ణయంతో వాటికి కొత్త రంగులు వేయాలని సూచించింది. సరిగ్గా స్థానిక ఎన్నికల సమరానికి ముందు ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ తగలడంతో ప్రతిపక్ష టీడీపీలో జోష్ నింపింది. నిజానికి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ రంగులే రాష్ట్రం నిండా కనిపించడం కామన్. ప్రభుత్వ కార్యాలయాలకు ఆటోమేటిగ్గా అధికార పార్టీ రంగులద్దేస్తారు. అయితే వైసీపీ హయాంలో ఇది పరాకాష్టకు చేరింది. గ్రామపంచాయతీలతోపాటు బడి, గుడి, గొడ్డూ, గోదా అనే తేడా లేకుండా ఇష్టమొచ్చినట్టుగా ఈ రంగుల కార్యక్రమం కొనసాగింది. పార్టీ నేతల అత్యుత్సాహంతో కొన్ని సందర్భాల్లో అధికారపార్టీ అబాసుపాలైంది కూడా. ఈ నేపథ్యంలో వైసీపీ రంగుల వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. మంగళవారం తీర్పు వెలువరించింది.

AP POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article