ఏపీ హైకోర్టు అక్కడే .. రేపే ప్రకటన ?    

AP high court to Kurnool

రాజ‌ధాని పై సీఎం జగన్ మోహన్ రెడ్డి రేపు అసెంబ్లీలో ప్రకటన చెయ్యనున్నారు. జగన్ మూడు రాజధానుల ప్రకటన చెయ్యనున్న నేపధ్యంలో  జుడిషియల్‌ క్యాపిటల్‌ నిర్మాణం కర్నూలు జిల్లా ఓర్వకల్‌లో ఏర్పాటు కావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఓర్వకల్‌ దగ్గర దాదాపు 25 వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు ఉన్నాయి. సమీపంలో ఎయిర్‌పోర్టు పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. అంతేకాదు హెల్త్‌సిటీ, డీఆర్‌డీవో, సోలార్‌ ప్రాజెక్టు, ఉర్ధూ యూనివర్శిటీ, టూరిజం శాఖ రాక్‌ గార్డెన్స్‌, స్టీల్‌ ఇండస్ట్రీ వంటి ముఖ్యమైన ప్రాజెక్టులు కూడా ఇక్కడే ఉన్నాయి. దీంతో జుడిషియల్‌ క్యాపిటల్‌ నిర్మాణం ఇక్కడ ఏర్పాటు చేస్తే ఓర్వకల్‌ ప్రాంతం మరో శ్రీ సిటీలా అభివృద్ది చెందే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. దీంతోపాటు ఎయిర్‌, రోడ్‌, రైల్‌ కనెక్టివిటీ అందుబాటులో ఉండటంతో అనుకూలంగా మారింది. అంతేకాదు శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ ఆధారంగా రాయలసీమ జిల్లాలకు నీటి తరలింపు ఇదే ప్రాంతం నుంచి వెళ్తుండటంతో.. వాటర్‌ స్టోర్‌ చేసుకునే అవకాశం ఉంది. అన్నీ ఆలోచించే ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అయితే అసెంబ్లీలో సీఎం జగన్ అధికారికంగా ప్రకటించిన వెంటనే దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

AP high court to Kurnool,AP assembly, capital amaravati, ap capital, capital farmers , three capitals, judicial capital, kurnool, orvakal

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article