గవర్నర్ తో సమావేశం అయిన మండలి చైర్మన్ షరీఫ్

AP Legislative Chairman Sharif Meet Governor
ఏపీలో రేపు శాసన సభలో మండలిపై చర్చ శాసన మండలి రద్దు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న సమయంలో అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్‌ గవర్నర్ భిశ్వభూషన్ హరిచందన్‌తో సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది .  రాజ్‌భవన్‌ నుంచి వచ్చిన పిలుపుతో శనివారం సాయంత్రం స్పీకర్ తమ్మినేని గవర్నర్‌తో సమావేశం అయ్యారు. ఆదివారం ఉదయం మండలి ఛైర్మన్ షరీఫ్‌ కూడా గవర్నర్‌ను కలిశారు. సాయంత్రం తేనీటి విందు  ఉంది. కానీ ముందుగానే ఇద్దరు సభాపతులతో బిశ్వభూషన్ సమావేశం కావడం ఆసక్తిని రేపుతోంది. రాష్ట్రంలోని తాజా పరిణామాలు, మండలి రద్దు వార్తలపై చర్చించినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *