ఐదుగురు ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం

AP MLC ELECTION COMPLETED

  • టీడీపీ నుంచి నలుగురు, వైఎస్సార్ సీపీ నుంచి ఒకరు

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఖాళీగా ఉన్న ఐదు స్థానాలకు ఐదు నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో వారంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు, వైఎస్సార్ సీపీ నుంచి ఒకరు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. టీడీపీ నుంచి యనమల రామకృష్ణ, దువ్వారపు రామారావు, అశోక్ బాబు, బీటీ నాయుడు నామినేషన్లు దాఖలు చేయగా.. వైఎస్సార్ సీపీ నుంచి జంగా కృష్ణమూర్తి నామినేషన్ వేశారు. నామినేషన్ల దాఖలుకు ఫిబ్రవరి 28 చివరి తేదీ. మార్చి ఒకటో తేదీ నుంచి వాటిని పరిశీలిస్తారు. అయితే, ఐదు స్థానాలకు ఐదు నామినేషన్లు మాత్రమే దాఖలు కావడం.. నామినేషన్ గడువు కూడా పూర్తి కావడంతో ఆ ఐదుగురూ ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు.

AP POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article