మళ్లీ నీళ్ల లొల్లి షురూ?

DONT INCLUDE RANGAREDDY- PALAMUR AND DINDI PROJECTS IN KRMB,#IF AP AGREES TO THIS, ANDHRA REGION WILL NOT GET WATER FOR 30.69 LAKHS ACRES,#ALLA VENKATA GOPALA KRISHNA RAO WROTE LETTER TO PANKAJ KUMAR

89
AP OPPOSE TS TWO PROJECTS
AP OPPOSE TS TWO PROJECTS
  • * ఏపీ సాగునీటి సంఘాల సమాఖ్య అధ్యక్షుడు వెంకట గోపాల కృష్ణారావు
  • * కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్కి లేఖ
  • కృష్ణానది యాజమాన్య బోర్డు (కె.ఆర్.ఎం. బి) పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర జల శక్తి రూపొందించిన నివేదికను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే, శ్రీశైలం ఎగువ భాగాన ఏ విధమైన అనుమతులు లేకుండా పాలమూరు, రంగారెడ్డి 90 టీఎంసీలు, దిండి 30 టీఎంసీలతో నిర్మిస్తున్న కొత్త ప్రాజెక్టుల్ని కెఆర్ఎంబి పరిధిలో చేరుస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి పొత్తూరి రామాంజనేయ రాజు, అందుబాటులో ఉన్న కార్యవర్గ సభ్యులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ రెండు ప్రాజెక్టులను కెఆర్ఎంబి పరిధిలోనికి చేర్చవద్దని కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ కి ఈ మెయిల్ ద్వారా వినతి పత్రం పంపించారు. అనంతరం ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు పత్రికా ప్రతినిధులతో మాట్లాడారు.
  • తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ఎగువ భాగాన కృష్ణా నది పై పాలమూరు రంగారెడ్డి 90 టీఎంసీలు దిండి 30 టీఎంసీల ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయని అన్నారు. దీనికి వ్యతిరేకంగా ఆంధ్ర రైతుల తరపున తాను సుప్రీం కోర్టులో పిటిషన్ 116/ 2016లో దాఖలు చేశానని తెలిపారు. దీని మీద వాదోపవాదాలు జరిగిన సమయంలో ఈ రెండు ప్రాజెక్టులు కొత్ వే అని రాష్ట్ర విభజన తర్వాత చట్ట వ్యతిరేకంగా తెలంగాణ నిర్మిస్తుందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేశామన్నారు. 2016 సెప్టెంబర్ లో జరిగిన మొదటి ఎపెక్స్ కౌన్సిల్ లోనూ, 2020 అక్టోబర్ లో జరిగిన రెండో ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. వాస్తవం ఇలాగుంటే కేంద్ర జల శక్తి శాఖ కెఆర్ఎంబి పరిధి నిర్ణయించే క్రమంలో కల్వకుర్తి ఎత్తిపోతల, శ్రీశైలం ఎడమ విద్యుత్ కేంద్రం, ఎస్ఎల్బీసీ తో పాటు కొత్త ప్రాజెక్టులు అయిన పాలమూరు రంగారెడ్డి , దిండి ఎత్తిపోతల పథకాలను కెఆర్ఎంబి పరిధిలో చేర్చడం చాలా దారుణమన్నారు. ఈ ప్రాజెక్టులు దొడ్డిదారిలో అమల్లోకి వస్తే శ్రీశైలం దిగువ భాగాన అన్ని రకాల అనుమతులు ఉన్న నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువల కింద ఉన్న గుంటూరు ప్రకాశం, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 15.71 లక్షల ఎకరాల ఆయకట్టు కృష్ణా డెల్టా కింద కృష్ణ, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు, శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ కింద కర్నూల్ జిల్లాలో ఉన్న 1.90 లక్షల ఎకరాల ఆయకట్టు మొత్తం 30.69 లక్షల ఎకరాల ఆయకట్టు బీడుభారే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
  • * దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో రాజీపడి ఈ రెండు ప్రాజెక్టులను కెఆర్ఎంబి పరిధిలో చేర్చటానికి ఒప్పుకుంటే భావితరాలకు అన్యాయం జరిగి భవిష్యత్తులో చుక్క నీరు కూడా ఆంధ్ర ప్రాంతానికి రాదని దీనిమీద రాష్ట్ర ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజీపడకూడదని విన్నవించారు. అవసరమైతే న్యాయపరమైన పోరాటం చేసి ఆంధ్ర ప్రాంత రైతుల నీటి హక్కులను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బచావత్ మరియు బ్రిజేష్ ట్రిబ్యునల్ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన 811 టీఎంసీలలో ఆంధ్రప్రదేశ్ కు 511 టీఎంసీలు తెలంగాణకు 299 టీఎంసీలు తాత్కాలిక ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించిన 299 టీఎంసీలలో 90 టీఎంసీలు చిన్న నీటి పారుదల కు పోగా, నీటిపారుదల ప్రాజెక్టులకు కేవలం 209 టీఎంసీలు మాత్రమే కేటాయింపు ఉందన్నారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం ఏ విధమైన అనుమతులు లేకుండా పాలమూరు-రంగారెడ్డి 90 టీఎంసీలు, దిండి 30 టీఎంసీ, మిషన్ భగీరథ 19.59 టీఎంసీలు, భక్త రామదాస 5.50 టీఎంసీలు, తుమ్మిళ్ల 5.44 టీఎంసీలు.. ఇలా మొత్తం 150. 53 టిఎంసీలతో కొత్త ప్రాజెక్టుల్ని నిర్మిస్తోందన్నారు. ఇప్పటికే ఉన్న ఎస్ఎల్బిసి 40 టీఎంసీలు, కల్వకుర్తి 40 టీఎంసీలు, నెట్టెంపాడు 25.40 టీఎంసీలతో విస్తరించి మొత్తం 255.53 టీఎంసీలతో శ్రీశైలం ఎగువ భాగాన తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల్ని నిర్మిస్తోందన్నారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నపుడు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యాం, ప్రకాశం బ్యారేజ్ కి భవిష్యత్తులో చుక్క నీరు రాని పరిస్థితి వస్తుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
  • * రాష్ట్ర ప్రభుత్వం పేపర్లో లీకులు ఇస్తూ నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోకుండా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి నీటిపారుదల రంగ నిపుణులతో చర్చించి ఈ విషయాన్ని ప్రధాన మంత్రి దృష్టికి, కేంద్ర హోంమంత్రి దృష్టికి వెంటనే తీసుకువెళ్ళి ఆంధ్ర రైతుల చట్టబద్ధమైన నీటి హక్కులను కాపాడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ వినతి పత్రము ప్రతులను కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ ఏ. పరమేశంకి, రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి జే. శ్యామల రావుకి, జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డికి ఈ మెయిల్ ద్వారా పంపినట్లు తెలిపారు. దీనిమీద సాగునీటి సంఘాల ప్రతినిధులుగా తమకు అవకాశం ఉన్న అన్ని పద్ధతుల్లోనూ ఆంధ్ర రైతులకు న్యాయం చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నామన్నారు. దీనిమీద ఆయకట్టులోని రైతులందరూ స్పందించి పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here