ఏపీలో రైతులకు మరింత భరోసా

AP RAITHU BHAROSA

ఆంధ్రప్రదేశ్ లో రైతులపై ఆ రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. రైతుభరోసా కింద ఇచ్చే సాయాన్ని రూ.వెయ్యి పెంచింది. అలాగే పథకం కాలపరిమితిని కూడా మరో ఏడాది పొడిగించింది. అగ్రిమిషన్ పై సీఎం జగన్ మోహన్ రెడ్డి జరిపిన సమీక్షలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమీక్ష అనంతరం వ్యవసాయ మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. సమీక్షలో సర్కారు తీసుకున్న నిర్ణయాలు వెల్లడించారు. జగన్ తన ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లపాటు పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించారు. మంగళవారం ఈ పథకం ప్రారంభం కానున్న తరుణంలో సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. పెట్టుబడి సాయాన్ని రూ.12,500 నుంచి రూ.13,500కి పెంచారు. అలాగే నాలుగేళ్లపాటు అమలు చేయాల్సిన ఈ పథకాన్ని ఐదేళ్లపాటు అమలు చేస్తామని పేర్కొన్నారు. ఏడాదిలో మూడు విడతలుగా ఈ రూ.13,500 ఇవ్వనున్నారు. ప్రతి ఏడా మే నెలలో రూ.7,500, రబీ అవసరాల కోసం రూ.4వేలు, సంక్రాంతి సమయంలో రూ.2వేలు ఇస్తామని పేర్కొన్నారు. అలాగే ఈ పథకం పేరు కూడా మార్చారు. వైఎస్సార్ రైతుభరోసాగా ఉన్న ఈ పథకాన్ని తాజాగా వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ సమ్మాన్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలను మాత్రం ఈ పథకం అనర్హులుగా ప్రకటించారు.

AP POLITICS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *