కొవిడ్ నివారణలో దేశానికే ఏపీ ఆదర్శం

ANDHRA PRADESH HAS BECOME ROLE MODEL TO INDIA IN COVID CONTROL, SAID AP GOVERNOR BISWABUSHAN HARICHANDAN. HE TOLD SOME INTERESTING POINTS IN HIS INAUGURAL SPEECH IN AP ASSEMBLY SESSION.

106
AP Governor Biswabhusan Harichandan
AP Governor Biswabhusan Harichandan

దేశంలో క‌రోనా సంక్షోభం కొన‌సాగుతున్నప్పటికీ రాష్ట్రంలో కోవిడ్ సంక్షోభంలోనూ సంక్షేమ ప‌థ‌కాల‌కు కొన‌సాగించామని కోవిడ్ నివార‌ణ‌లో ఏపీ దేశానికే ఆద‌ర్శంగా నిలిచిందని ఆంధ్రప్రదేశ్ గ‌వ‌ర్న‌ర్ విశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. గురువారం ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ.. క‌రోనా చికిత్స‌ను ఆరోగ్య‌శ్రీ‌లో చేర్చాం ఆరోగ్యశ్రీ‌కి ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో 50 శాతం బెడ్లు కేటాయించామన్నారు. ఇంకా, ఆయన ఏమన్నారో గవర్నర్ మాటల్లోనే..

  • క‌రోనా వ‌ల్ల మ‌రోసారి ఆర్ధిక రంగంపై తీవ్ర ప్ర‌భావం పడింది. అయినప్పటికీ, ప్ర‌జా సంక్షేమ‌మే ధ్యేయంగా 95 శాతం హామీలను పూర్తి చేశాం. న‌వ‌ ర‌త్నాల ద్వారా ల‌బ్ధిదారుల‌కే నేరుగా సాయం అందజేశాం. ఇప్పటి వరకు కోటి 80 లక్షల మంది టెస్టులు చేయగా 14 లక్షల 54 వేల మందికి పాజిటివ్‌ వచ్చింది. ప్రతిరోజూ 590 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేశాం. జగనన్న విద్యా కానుక కింద 47 లక్షల మందికి విద్యాకానుక అందించాం.
  • * కరోనా ప్రభావం ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థపై ఏపీ ఆర్థిక పురోగతిని కనబరిచింది. 2020-21లో జాతీయ అభివృద్ధి రేటు నెగిటివ్‌ ఉండగా ఏపీ 1.58 శాతం అభివృద్ధి రేటు కనకబరిచింది. రాష్ట్రంలో 53.28 లక్షల మందికి తొలిడోసు ఇచ్చాం. 21.64 లక్షల మందికి సెకండ్‌ డోసు వ్యాక్సినేషన్‌ పూర్తయ్యింది. వాలంటీర్ వ్య‌వ‌స్థ ద్వారా ఇంటింటికి సంక్షేమ ప‌థ‌కాల్ని అందిస్తున్నాం. 44.5 ల‌క్ష‌ల మంది త‌ల్లుల‌కు జ‌గ‌న‌న్న అమ్మ ఒడి పథకాన్ని వర్తింపజేస్తున్నాం. రూ.1600 కోట్ల‌తో 36.8ల‌క్ష‌ల మందికి జ‌గ‌న‌న్న గోరు ముద్ద‌ పథకాన్ని అమలు చేస్తున్నాం.
  • * వ‌చ్చే ఏడాది నుంచి సీబీఎస్ విద్యా బోధ‌న‌ ఉంటుంది. నాడు- నేడు ద్వారా 15వేల స్కూళ్ల‌లో మ‌ర‌మ్మ‌తులు చేపట్టాం. అంగ‌న్ వాడీల ద్వారా పిల్ల‌ల‌కు పౌష్టికాహారం అందజేస్తున్నాం. విద్యా శాఖ‌కు అన్ని ప‌థ‌కాల కింద రూ.25,714 కోట్లు కేటాయిస్తున్నాం. 108,104 అంబులెన్స్ ల సంఖ్య‌ను పెంచాం. కొత్త మెడిక‌ల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం. ఏపీలో 95 శాతం జ‌నాభాకు ఆరోగ్య‌ శ్రీ వ‌ర్తిస్తుంది. 10,778 రైతు భ‌రోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. రైతుల‌కు 9గంట‌ల నిరంత‌ర‌ ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.
  • * అమూల్ తో ఒప్పందం ద్వారా పాడి రైతుల‌కు అద‌న‌పు ఆదాయం అందజేస్తున్నాం. 9250 మొబైల్ వాహ‌నాల ద్వారా ఇంటింటికి రేష‌న్ పంపిణీ చేస్తున్నాం. అర్హులైన వారంద‌రికీ ఇంటి స్థ‌లాలు ఇచ్చాం. పేద‌ల‌కు రెండు ద‌శ‌ల్లో ఇళ్లు నిర్మించి ఇస్తాం. పెన్ష‌న్ల కింద ప్ర‌తి నెల 1వ తేదీనే రూ.1407 కోట్లు సాయం అందజేస్తున్నాం. వైయ‌స్ఆర్ కాపు నేస్తం ద్వారా 419కోట్ల సాయం, 45 ఏళ్లు పైబ‌డిన మ‌హిళ‌ల‌కు రూ.15వేలు సాయం అందిస్తున్నాం. సాగునీటి ప్రాజెక్టుల‌కు పూర్తికి అధిక ప్రాధాన్యత‌నిస్తున్నాం. క‌ర్నూలు ఎయిర్ పోర్టును అందుబాటులోకి తెచ్చాం. జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన‌కు రూ.1049కోట్లు, స్కూళ్ల ఆధునీక‌ర‌ణ‌కు రూ.3948కోట్లు, జ‌గ‌న‌న్న విద్యా దీవెన‌కు రూ.4879.30కోట్లు, అమ్మ ఒడి ప‌థ‌కానికి రూ.13,022కోట్లు కేటాయించామని వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here