ఐ ఫోన్ యూజర్లకు సారీ చెప్పిన ఆపిల్

APPLE COMPANY SAY SORRY

ఐప్యాడ్, ఐఫోన్ వినియోగదారులకు ఆపిల్ సంస్థ సారీ చెప్పింది. గ్రూప్ ఫేస్ టైమ్ కాల్స్ యాప్ లో భద్రతాపరమైన లోపం ఉందని, తమ యూజర్లకు కలిగిన ఈ అసౌకర్యానికి క్షమాపణ చెబుతున్నామని పేర్కొంది. భద్రతాపరమైన ఈ లోపం గురించి ముందుగా తెలియజేసిన 14 ఏళ్ల బాలుడికి ధన్యవాదాలు తెలిపింది. గ్రూప్ ఫేస్ టైమ్ కాల్స్ యాప్ లో ఇతరుల సంభాషణను వారికి తెలియకుండా వినొచ్చనే విషయాన్ని థాంప్సన్ కుటుంబానికి చెందిన ఓ 14 ఏళ్ల బాలుడు కనిపెట్టాడు. వెంటనే దీని గురించి ఆపిల్ సంస్థకు తెలియజేశాడు. దీంతో అప్రమత్తమైన సంస్థ.. వెంటనే గ్రూప్ ఫేస్ టైమ్ కాల్స్ యాప్ ను డిజేబుల్ చేసి, ఆ బగ్ ను తొలగించే పని ప్రారంభించింది. అలాగే ఈ విషయం గురించి తన వినియోగదారులకు తెలియజేసింది. ‘ఈ సెక్యూరిటీ బగ్ గురించి థాంప్సన్ కుటుంబానికి చెందిన 14 ఏళ్ల బాలుడు ముందుగా మాకు తెలియజేశాడు. అతడికి ధన్యవాదాలు చెబుతున్నాం. ఈ బగ్ కారణంగా ఆందోళనకు గురవుతున్న మా వినియోగదారులందరికీ క్షమాపణ చెబుతున్నాం. ప్రస్తుతానికి ఈ యాప్ ను డిజేబుల్ చేశాం. సెక్యూరిటీ బగ్ ను మా ఇంజనీర్లు ఆపిల్ సర్వర్లో సరిచేశారు. దీనికి సంబంధించిన సాఫ్ట్ వేర్ అప్ డేట్ ను వచ్చేవారం విడుదల చేస్తాం’ అని ఆపిల్ ఓ ప్రకటనలో పేర్కొంది.

MOBILE MARKET

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article