సాహో తెలంగాణ పోలీస్..

Appreciations to Telangana police

తెలంగాణ రాష్ట్రంలో వెటర్నరీ డాక్టర్ దిశ సామూహిక అత్యాచారం, హత్య అందర్నీ షాక్ కు గురి చేసింది. ఇక ఈ కేసు తెలంగాణలో  మరో  నిర్భయ తరహా ఘటనగా దేశం మొత్తం చర్చనీయాంశంగా మారింది.  మరో అమాయకురాలు కామాంధుల పైశాచికత్వం బలైపోయిందని దేశం మొత్తం వారిని ఎన్ కౌంటర్ చెయ్యాలని నినదించిన వేళ తెలంగాణా ప్రభుత్వం , తెలంగాణా పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు .దిశ కేసు నిందితులను  దిశను సజీవ దహనం చేసిన చోటే ఎన్ కౌంటర్ చేశారు. ఇక ఈ ఘటనపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్న తరుణంలో

దిశ ఎన్ కౌంటర్ సమాచారంపై దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై వాట్సాప్ గ్రూపుల్లోనూ.. సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు. అందరూ పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని మెచ్చుకుంటున్నారు. ఇక ఘటనా స్థలంలో పోలీసులను హీరోలుగా అభివర్ణిస్తూ నినాదాలు చేస్తున్నారు. పూల వర్షం కురిపిస్తున్నారు. ఎన్ కౌంటర్ మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. సామాన్యుల మొదలు సెలబ్రిటీల వరకూ.. రాజకీయ ప్రముఖులు సైతం తాజా ఎన్ కౌంటర్ కు మద్దతుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా టాలీవుడ్ హీరో మంచు మనోజ్  చేసిన కామెంట్ అందరిని ఆకర్షిస్తోంది.ఆ బుల్లెట్టు దాచుకోవాలని ఉంది.. ఆ తుపాకులకు దండం పెట్టాలని ఉంది.. ఆ పోలీసుల కాళ్లు మొక్కాలని ఉంది.. నలుగురు చచ్చారనే వార్తలో ఇంత కిక్కు ఉందా? ఈ రోజునే నీ ఆత్మ దేవుడ్ని చేరింది చెల్లెమ్మా అంటూ రియాక్ట్ అయ్యారు. ఇలా పెద్ద ఎత్తున ఎన్ కౌంటర్ కు.. పోలీసుల చర్యలకు ప్రజలు పాజిటివ్ గా రియాక్ట్ కావటం గమనార్హం.ఇక ఇదే తరహా వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పోస్టులు హల్చల్ చేయటం ప్రస్తుతం కనిపిస్తుంది .

Appreciations to Telangana police,disha  muder, encounter, shad nagar , chatan palli bridge , police , cp sajjanar, manchu manoj, social media, twitter , face book

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *