అర్దరాత్రి నుండి ఏపీ ఆర్టీసీ సమ్మె సైరన్

AP RTC Strike … డిమాండ్స్ ఇవే

ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ సమ్మె సైరెన్ మోగింది. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట పాత్తనున్నారు. ఫిబ్రవరి 5వ తేదీ అర్థరాత్రి.. అంటే తెల్లవారితే 6వ తేదీ నుంచి ఆర్టీసీ సమ్మెకి దిగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 12వేల ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. సమ్మెలో 53 వేల మంది ఉద్యోగులు పాల్గొంటున్నారు. ఆర్టీసీ సమ్మె చేస్తే రోజుకి 13 కోట్ల రూపాయల వరకు నష్టం రానుంది. సంక్రాంతికి ముందే సమ్మెకు వెళ్లాలనుకున్న కార్మిక జేఏసీ.. పండుగ తర్వాత డిమాండ్లపై సీఎంతో చర్చిస్తామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో సమ్మె వాయిదా వేసుకుంది. పండుగ తర్వాత జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎంప్లాయిస్ యూనియన్‌ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చింది. ఆర్టీసీలో సమస్యల పరిష్కారం కోసం గుర్తింపు కార్మిక సంఘం ఇతర కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి సమ్మె చేయనున్నారు.
ఇక ప్రధానంగా కార్మికుల డిమాండ్స్ చూస్తే కార్మికులకు 50శాతం పిట్ మెంట్ ఇవ్వాలి. ఆర్టీసీని ఆర్థికంగా ఆదుకోవాలి. ఏప్రిల్ 2, 2017 నుంచి జరగాల్సిన వేతన సవరణను వెంటనే అమలు చేయాలి. సర్వీస్ కండీషన్లు పరిష్కరించాలని కార్మిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎస్మా ప్రయోగిస్తామంటున్న ప్రభుత్వ హెచ్చరికలను లెక్కచేయం అంటున్నారు. చాలా ఎస్మాలు చూశామని కూడా అంటున్నారు కార్మిక నేతలు. చర్చలకు సిద్ధంగా ఉన్నాం అని.. అయితే డిమాండ్ల పరిష్కారంపైనే హామీ రావటం లేదని అంటున్నారు కార్మికులు. ఏపీ ఆర్టీసీ సమ్మెతో 12 రీజియన్లలో అన్ని డిపోల ఎదుట నిరసన ఆందోళనలు చేయాలని కూడా నిర్ణయించారు కార్మికులు. సమ్మెకు టీడీపీ మినహా మిగతా పార్టీల మద్దతు ఉందని అంటున్నారు కార్మిక సంఘాల నేతలు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article