కాంగ్రెస్.. మరో వికెట్

AREPALLI JOIN IN TRS

  • టీఆర్ఎస్ లో చేరిన ఆరెపల్లి మోహన్

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ క్రమంగా ఖాళీ అవుతోంది. ఆ పార్టీ నుంచి అధికార టీఆర్ఎస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకోగా.. మరికొందరు సైతం అదే దారిలో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో టీపీసీసీ ఎస్సీ సెల్‌ ఛైర్మన్‌ ఆరెపల్లి మోహన్‌ హస్తం పార్టీకి గుడ్ బై చెప్పి, టీఆర్ఎస్ లో చేరారు. ఆదివారం హైదరాబాద్‌లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. మోహన్ తోపాటు పలువురు సర్పంచులు, జడ్పీటీసీలను పార్టీలోకి కేటీఆర్‌ ఆహ్వానించారు. ఆరెపల్లి మోహన్‌ రాకతో మానకొండూర్‌ నియోజకవర్గంలో గులాబీ పార్టీ మరింత బలోపేతమవుతుందని కేటీఆర్‌ అన్నారు. బంగారు తెలంగాణ సాధన కోసం పాటుపడుతున్న కేసీఆర్‌కు మద్దతుగా నిలిచేందుకే తాను తెరాసలో చేరానని ఆరెపల్లి మోహన్‌ వివరించారు.

TS POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article